రఘునందన్ రావు గెలిచాక సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ముఖ్యమంత్రి, అసదుద్దీన్ ఒవైసీ, డీజీపీ, ఎస్ఈసీ కలిసి హడావిడిగా ఎన్నికలు పెట్టారని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ అన్ని ముందే సిద్ధం చేసుకుని ఇతర పార్టీలకు టైమ్ ఇవ్వలేదని బండి సంజయ్ విమర్శించారు. పదివేల రూపాయల సాయంతో కార్పోరేటర్‌లు గెలవడానికి ప్లాన్ వేశారని ఆయన ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్, ఎంఐఎంలు పలు బూతుల్లో రిగ్గింగ్ చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. 20 సీట్లలో తాము తక్కువ ఓట్లతో ఓడిపోయామని.. కార్పోరేటర్లతో రెండు మూడు రోజుల్లో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటామని ఆయన చెప్పారు.

అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని.. ఎమ్మెల్యేలు, మంత్రుల చిట్టా సిద్దంగా వుందన్నారు. ఎంఐఎంను వచ్చేసారి పాతబస్తీలో కూడా గెలవకుండా చేస్తామని.. రేపు గాని ఎల్లుండి గానీ విజయశాంతి బీజేపీలో చేరతారని సంజయ్ చెప్పారు. జానారెడ్డి మాకు ఫోన్ చేయలేదు.. మేము ఆ కుటుంబంతో టచ్‌లో లేమని ఆయన స్పష్టం చేశారు.