Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగ భృతి, ఏప్రిల్ ఫూల్స్ డేని లింక్ చేస్తూ.. కేసీఆర్‌పై బండి సంజయ్ సెటైర్లు , ట్వీట్ వైరల్

ఫూల్స్ డేను పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గతంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న కేసీఆర్ హామీని టార్గెట్ చేసి ఆయన విమర్శలు చేశారు. 

telangana bjp chief bandi sanjay satires on cm kcr onthe ocassion of fools day ksp
Author
First Published Apr 1, 2023, 2:49 PM IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్, కేటీఆర్ పరువు నష్టం నోటీసుల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా బండి సంజయ్ దూకుడు పెంచారు. తాజాగా ఆయన మరోసారి సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ ట్వీట్ చేశారు.  ‘‘ఓ నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్’’ అని రాసి ఉన్న ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. అందులో ‘‘మీ అకౌంట్ లో రూ.3,016 క్రెడిట్ అయ్యాయి’’ అనే మెసేజ్ ఉంది. దానికింద కేసీఆర్ నవ్వుతున్న ఫొటోను పెట్టారు. ‘‘నిరుద్యోగ యువతకు రూ.3,016 భృతి ఇస్తాం- సీఎం కేసీఆర్. మీరు దీనిని నమ్మితే ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు’’ అంటూ బండి సంజయ్ సెటైరికల్ క్యాప్షన్ పెట్టారు. 

మరోవైపు.. తెలంగాణ రాజకీయాల్లో శనివారం ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు.. అధికార బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. అలాగే ప్రగతి భవన్ మార్చ్ (సీఎం హౌస్ మార్చ్) పిలుపు నిద్దామని సూచించారు. 

Also REad: పరువుకు 100 కోట్లా.. మరి నిరుద్యోగులకి నువ్వెంత కట్టాలి, లీగల్‌గానే వెళ్తా : కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్

సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కెసిఆర్ బ్రతకనివ్వడని కూడా అ్నారు. అయితే ఈ విషయంపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపినట్టుగా సమాచారం. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని.. త్వరలో సమావేశం అవుదామని చెప్పినట్టుగా తెలిసింది. 

మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని కూడా షర్మిలతో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. అయితే పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తెలుపుతామని ఆయన పేర్కొన్నట్టుగా  తెలిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios