12 శాతం ముస్లింలు ఉన్న బీహార్ లో ఎంఐఎం 5అసెంబ్లీ సీట్లు గెలిచింది... తెలంగాణలో 80శాతం హిందువులు ఉన్నారు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎందుకు గెలువొద్దు అని సంజయ్ పేర్కొన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి నోటి నుండి హిందువు అనే పదం వచ్చిందని...ఆ పదం రావడానికి బీజేపీనే కారణమన్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కూడా నేను హిందువు అన్నాడు...అందుకూ బిజెపియే కారమన్నారు. 12 శాతం ముస్లింలు ఉన్న బీహార్ లో ఎంఐఎం 5అసెంబ్లీ సీట్లు గెలిచింది... తెలంగాణలో 80శాతం హిందువులు ఉన్నారు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎందుకు గెలువొద్దు అని సంజయ్ పేర్కొన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావుకు మద్దతుగా కర్మన్ ఘాట్ లోని కొత్తకాపు యాదిరెడ్డి గార్డెన్స్ లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అయోధ్య రాముడిది ఉత్తరప్రదేశ్ అన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నారు.. కేరళ వెళ్ళారా? అంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకులు పెడితే పెండ్లి కోరుతారు... లేకపోతే చావు కోరుతారని సంజయ్ మండిపడ్డారు.
read more కేంద్రం అన్నీ ఇస్తే.. వీళ్లు పొడిచేదేం లేదు: టీఆర్ఎస్‌పై బండి సంజయ్ సెటైర్లు
''80 శాతం హిందువులు ఉన్న భారతదేశంలో అయోధ్య రాముడు గుడి కట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అని ప్రపంచ దేశాలు చర్చించుకున్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 4 లక్షల మంది త్యాగం చేశారు. రామ మందిర నిర్మాణానికి ఇన్ని సంవత్సరాలు పట్టడానికి గత పాలకుల పాపమే కారణం. ప్రస్తుతం ప్రధాని మోడీ రామమందిరాన్ని అయోధ్యలో నిర్మిస్తున్నారు. రామ రాజ్యం నెలకొల్పడానికి ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేస్తున్నారు'' అని అన్నారు.
''మూర్ఖుడి పాలనలో తెలంగాణ తల్లి బంది అయింది. ఈ మూర్ఖుడి పాలన నుండి తెలంగాణ తల్లి విముక్తి కోరుకుంటుంది. అందుకే తెలంగాణ లో బీజేపీ మలి దశ ఉద్యమం ప్రారంభించింది. 2ఎమ్మెల్సీ స్థానాలో బీజేపీని గెల్పించండి'' అని సంజయ్ కోరారు.
''అడ్వోకేట్స్ కు రూ.100 కోట్ల నిధి ఏర్పాటూ చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ పని చేయలేదు. ఇక ఇటీవల అడ్వోకేట్స్ వామనరావు దంపతులను నడిరోడ్డుపై అతి కిరాతకంగా హత్యచేస్తే సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. బార్ కౌన్సిల్ మీద కేసీఆర్ కు నమ్మకం లేదు...కేవలం బార్ పైనే నమ్మకం ఉంది'' అని సంజయ్ ఎద్దేవా చేశారు.
