టీఆర్ఎస్‌పై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయాలని కేసీఆర్ అడిగారా.. అలాంటి పార్టీకి ఎందుకు వేయాలని సంజయ్ ప్రశ్నించారు.

టీఆర్ఎస్‌పై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయాలని కేసీఆర్ అడిగారా.. అలాంటి పార్టీకి ఎందుకు వేయాలని సంజయ్ ప్రశ్నించారు.

ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చుతామని ఒవైసీ అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. భారత్ బయోటెక్‌కు ప్రధాని వస్తే కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదని సంజయ్ మండిపడ్డారు.

Also Read:తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎందుకు నోరు మెదపరు: బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్

కేంద్రం ఏమీ ఇవ్వలేదని కేటీఆర్ అంటున్నారని.. అన్నీ ఇచ్చాక వీళ్లు పొడిచేది ఏం లేదంటూ చురకలు వేశారు. కేంద్రం నిధులు లేనిదే ఏ పథకం లేదని గోడకు వేసిన తుపాకీ తుప్పు పట్టిందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు.

20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు కేసీఆర్ నిరూపిస్తే కేసీఆర్‌కు తోమాల సేవ చేస్తానన్న ఆయన.. నిరూపించుకుంటే బడిత పూజ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.