Asianet News TeluguAsianet News Telugu

అటు కేసీఆర్... ఇటు బండి సంజయ్: ఆ విషయంలో రాజకీయాల్లేవ్

 తాము కేవలం రాజకీయాలే కాదు అవసరమైతే ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాల్లో దగ్గరుండి పాల్గొంటామని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ నిరూపించారు.

telangana bjp chief bandi sanjay participated  harithaharam programme
Author
Karimnagar, First Published Jun 25, 2020, 12:21 PM IST

కరీంనగర్: తెలంగాణ బిజెపి ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే పనిగా పెట్టుకుంది. ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై అగ్రెసివ్ గా ముందుకు వెళుతున్నారు. ఇటీవల కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందంటూ సంజయ్ నేతృత్వంలోని బిజెపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇలా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపిల చర్యలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. 

అయితే  తాము కేవలం రాజకీయాలే కాదు అవసరమైతే ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాల్లో దగ్గరుండి పాల్గొంటామని బండి సంజయ్ నిరూపించారు. ఆయన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ స్వయంగా మొక్కలు నాటారు. అంతేకాకుండా ప్రతిఒక్కరు  మొక్కలు నాటాలంటూ బిజెపి  శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 

మరోవైపు ఇవాళే ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో ఆరు మొక్కలు నాటి  హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ ఇక్కడకు చేరుకుని అల్లనేరేడు మొక్క నాటనున్నారు. 

read more  తెలంగాణకు హరితహారం : అడవిని తలపిస్తున్న కరీంనగర్ కమీషనరేట్...

ఆకుపచ్చ కరీంనగర్ ను తయారు చేసేందుకు 6వ విడత హరితహారంలో జిల్లావ్యాప్తంగా 55 లక్షలు, నగరంలో 14.5 కిలోమీటర్ల పరిదిలో 10 లక్షల మొక్కలు నాటుతామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 6వ విడత తెలంగాణకు హరితహారాన్ని కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అందులో భాగంగా నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద జిల్లా కలెక్టర్ కే.శశాంక, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు, మేయర్ సునిల్ రావు, కమీషనర్ క్రాంతి మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. 

మున్సిపల్ నిధులతో తిమ్మాపూర్, రుక్మా పూర్ లో లంగ్ స్పెస్ అడవులు, సదాశివపల్లి వద్ద మియావాకి పద్దతిలో చిట్టడవి పెంచుతామన్నారు. గతంలో అడవులకు నిలయంగా ఉన్న కరీంనగర్ జిల్లాకు చెట్ల పెంపకంతో పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు అందిస్తామన్నారు. మొక్కల పెంపకంలో ప్రతిఒక్కరు భాగస్వాములై తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచన ప్రకారం భావి తరాలకు ఆస్తిగా మారే విధంగా యుద్ద ప్రతిపదికన మొక్కలు నాటుతామన్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడవులకు పెట్టినిల్లుగా ఉండేది...మల్లి గత పూర్వ వైభవాన్ని తీసుకొస్తామన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించేందుకు పకడ్పంది చర్యలు తీసుకుంటామన్నారు. పెట్టిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రధాన రహదారుల వెంబడి మూడు లైన్ లలో మొక్కలు నాటుతామని తెలిపారు. ఒక్కొక్క రూట్ కు ఒక అధికారిని నియమించి నాటిన మొక్కలను సంరక్షిస్తామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కు చెందిన నిధులతో పాటు వివిద శాఖల నుండి కూడ నిధులను కేటాయించి మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. 

చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట, మానకొండూర్ అన్ని నియోజక వర్గాల్లో హారితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. మానేరు రిజర్వాయర్, బైపార్ రోడ్లు మొత్తంలో మొక్కలు నాటుతామన్నారు. సదాశివ్ పల్లిలో 2 ఎకరాల్లో మియావాకీ పద్దతిలో చిట్టడవులను పెంచుతామన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న అక్కడ మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. కరీంనగర్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వ యంత్రాం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. 

ప్రజలు కూడ ఇండ్లలో ఇచ్చిన 6 మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.    ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సుడా చైర్మెన్ జివి.రామకృష్ణరావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి  మరియు పలు డివిజన్ల కార్పోరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులతో పాటు వివిద శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios