Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు .. సెకండ్ లిస్ట్‌లోనూ మొండిచేయి, వరంగల్‌లో ముస్లింలు కాంగ్రెస్‌కు మద్ధతిస్తారా..?

ముస్లింల జనాభా గణనీయంగా వున్న వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ముస్లిం నాయకత్వానికి మద్ధతివ్వాలని ముస్లిం సమాజం, దాని ప్రతినిధులు కాంగ్రెస్‌ను కోరినప్పటికీ , ఆ పార్టీ మాత్రం ఇతర వర్గాల నుంచి అభ్యర్ధులను ప్రకటించింది. 

Telangana Assembly polls : Congress overlooks Muslim candidates in Warangal ksp
Author
First Published Oct 28, 2023, 2:41 PM IST

సుధీర్ఘ కసరత్తు, వడపోత, సామాజిక సమీకరణలు లెక్కలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన రెండో జాబితాను ప్రకటించింది. గెలుపు గుర్రాలు, వలస నేతలకే ఈ సందర్భంగా ప్రాధాన్యత కల్పించినట్లుగా తెలుస్తోంది. అయితే లిస్ట్ విడుదలైన వెంటనే సహజంగానే అసంతృప్తులు అధిష్టానంపై భగ్గుమన్నారు. చాలా మంది పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో అభ్యర్థుల గెలుపును శాసించే వర్గాలను మచ్ఛిక చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్. మరోవైపు..  ముస్లింల జనాభా గణనీయంగా వున్న వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ముస్లిం నాయకత్వానికి మద్ధతివ్వాలని ముస్లిం సమాజం, దాని ప్రతినిధులు కాంగ్రెస్‌ను కోరినప్పటికీ , ఆ పార్టీ మాత్రం ఇతర వర్గాల నుంచి అభ్యర్ధులను ప్రకటించింది. 

శుక్రవారం రాత్రి 45 మందితో విడుదల చేసిన కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌లో వరంగల్ పశ్చిమంలో నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్‌కు మాజీ మంత్రి కొండా సురేఖలకు టికెట్లు కేటాయించారు. కొండా సురేఖ గతంలో శ్యాంపేట, పరకాల, వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి .. ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్ధిగా ఎంపికైన రాజేందర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. వరంగల్ ఈస్ట్‌కు చెందిన సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తనకు అవకాశం కల్పించాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. గతంలో వరంగల్‌కు చెందిన ముస్లిం కమిటీలోని అత్యధికులు కాంగ్రెస్‌కు మద్ధతుగా నిలిచారు. అలాంటి వారికి సెకండ్ లిస్ట్ వారికి అసంతృప్తిని కలిగించే అవకాశం వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ALso Read: మామ మూడో సారి సీఎం అవుతారు.. పవర్ మన చేతిలోనే ఉంటుంది - ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ

కాకపోతే.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్‌లను బరిలోకి దింపింది. రైతులు, యువత, ఎస్సీ, ఎస్టీ, గిరిజన, మహిళా డిక్లరేషన్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ.. ‘‘మైనారిటీ డిక్లరేషన్’’ ను ప్లాన్ చేస్తోంది. గత వారం కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీపీసీ మైనారిటీ డిక్లరేషన్ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ మహ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమానికి 5000 కోట్ల కేటాయింపుతో పాటు వివాహం చేసుకున్న ముస్లిం జంటలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసే అవకాశం వుందన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 శాతం ముస్లిం ఓటర్ల మద్ధతుతో 88 సీట్లు గెలుచుకుంది. ఇకపోతే.. వరంగల్ ఈస్ట్ నుంచి నన్నపునేని నరేందర్, వరంగల్ వెస్ట్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్‌‌లకు బీఆర్ఎస్ పార్టీ  అవకాశం కల్పించింది. బీజేపీ విషయానికి వస్తే.. వరంగల్ ఈస్ట్ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పశ్చిమ నుంచి పద్మారావులను బరిలోకి దింపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios