Asianet News TeluguAsianet News Telugu

ఇవేం తిట్లు రా బాబు .. మంత్రి మల్లారెడ్డి, హరీష్ రావులపై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు 

తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా తన కొడుకుకి టికెట్ కేటాయించలేదని బీఆర్ ఎస్ వీడిన మైనంపల్లి.. మంత్రి మల్లారెడ్డి, హరీష్ రావులను తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Telangana Assembly Elections Mynampally Hanumantha Rao Shocking Comments On Ministers Mallareddy and Harish Rao KRJ
Author
First Published Nov 3, 2023, 12:52 PM IST

తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ తరుణంలో అధికార,, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ నేతల మధ్య నిత్య మాటల యుద్దం సాగుతోంది. తాజాగా తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని గులాబీ పార్టీకి వీడిన మైనంపల్లి హనుమంతరావు.. మల్లారెడ్డి, హరీష్ రావులపై బూతుపురాణం అందుకున్నారు. వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  మంత్రి మల్లారెడ్డిని మాత్రం ఓ రేంజ్ లో కడిగేశారు. మొత్తానికి మంత్రి మల్లారెడ్డి, మైనంపల్లి మాటల యుద్ధం మాత్రం తారాస్థాయికి చేరింది.

మైనంపల్లి .. ప్రధానంగా మంత్రి మల్లారెడ్డిని మాత్రం టార్గెట్ చేశారు. మల్లారెడ్డి స్థాయి తన స్థాయి ఒక్కటి కాదనీ, రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డి బచ్చాగాడని అన్నారు. మంత్రి మల్లారెడ్డి బఫూన్ మంత్రి అనీ, సదువురాని వాడని ఎద్దేవా చేశారు. మల్లారెడ్డి ఏం మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కాదనీ, పైగా తనకు గౌరవం ఇవ్వాలని అంటాడని విమర్శించారు. తనని తాను మాస్టర్ ఆల్ జాక్ ఆఫ్ ఆల్ అంటూనే.. తాను రాజకీయాల్లోనే కాదు.. క్రీడల్లో కూడా ఫస్టేనని అన్నారు.

తాను క్రికెట్‌లో ఓపెనింగ్ పోతే నాటౌట్ గా వచ్చేవాడినని, వాలీ బాల్ టీం మొత్తం తానే లీడ్ చేసేవాడిని అన్నారు. మంత్రిగా తన నియోజక వర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశాడు.మంత్రి మల్లారెడ్డిని  బఫూన్ మంత్రి అని, అంగోటా చాప్ అని.. అతనికి డ్యాన్స్ లు తప్ప ఏం రావని అన్నారు. ఏమైనంటే.. పాలమ్మినా.. పూలమ్మినా .. అంటాడనీ, ఆయనకు సబ్జెక్ట్ లేదని విరుచుకపడ్డారు. మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారనీ, హరీశ్ రావుతో పాటు మల్లారెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.  ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అవుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios