కేసీఆర్.. భారతదేశ చిత్రం.. గులాబీ రంగు గుభాళింపుతో సిద్దమైన బీఆర్ఎస్ ప్రచార రథం !
BRS-KCR: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం సిద్ధమైంది.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం సిద్ధమైంది.
వివరాల్లోకెళ్తే.. అధికార బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ మేనిఫెస్టోను గేమ్ ఛేంజర్ గా అభివర్ణించడం ప్రతిపక్షాలను షాకిస్తుందని భావిస్తున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించనున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనితో పాటు పార్టీ తన అభ్యర్థులకు బి-ఫారాలను అందిస్తుంది. రానున్న ఎన్నికల్లో ఓట్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించడం, ముఖ్యంగా రైతు రుణమాఫీ వంటి గత హామీలను పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపకల్పనలో కేసీఆర్ గణనీయమైన కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో హుస్నాబాద్ వేదికగా నేడు ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎన్నికల ప్రచార రథం సిద్దమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా విడుదల చేసిన చిత్రాల్లో అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథం సిద్ధమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానాగా అందించారు.
కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు ఈ వాహనం చేరుకుంది. ఆదివారం నుంచి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై ప్రచార రథం పరుగులు పెట్టనుంది. ఇవాళ హుస్నాబాదుకు ప్రచార రథం చేరుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, కేసీఆర్ తో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా సీనియర్ నేతల జాబితాను కూడా సిద్ధం చేసి ఎన్నికల భారాన్ని పంచుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన సొంత సిరిసిల్లతో పాటు ఈసారి పోటీకి రెండో నియోజకవర్గంగా పార్టీ అధినేత ఎంపిక చేసిన హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), కామారెడ్డి నియోజకవర్గాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మరో అగ్రనాయకుడు హరీష్ రావు సైతం ఎన్నికల ప్రచారం కీలక బాధ్యలు నిర్వర్తిస్తున్నారు.