సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సై అంటున్నారు. తాజాగా పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల లిస్ట్ ను కూడా పాల్ విడుదల చేసారు, 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రజాశాంతి పార్టీ సిద్దమయ్యింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. తాజాగా అభ్యర్థుల జాబితాను కూడా కేఏ పాల్ విడుదల చేసారు. 12 నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులను ఇప్పటివరకు ఖరారు చేసినట్లు పాల్ తెలిపారు. అతి త్వరలో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు కెఏ పాల్ తెలిపారు. 

ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల లిస్ట్ :

జహిరాబాద్(ఎస్సి) - బేగరి దశరథ్ 

జుక్కల్(ఎస్సి) - కర్రోల్ల మోహన్ 

గజ్వేల్ - పాండు  

చెన్నూరు -రాంబాబు 

నర్సాపూర్ - సిరిపురం బాబు 

ఉప్పల్ - అనిల్ యాదవ్

కల్వకుర్తి - జంగయ్య

మధిర - కొప్పుల శ్రీనివాసరావు 

రామగుండం - కనకరాజు 

నకిరేకల్ - కిరణ్ కుమార్  

యూకుత్ పురా - నరేష్ 

వేములవాడ - అజ్మీరా రమేష్ 

ఇక ఇప్పటికే సికింద్రాబాద్ నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు కేఏ పాల్ ఇప్పటికే ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వారినుండి దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇప్పటివరకు తమ పార్టీ టికెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 344 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వాటిని పరిశీలించి అన్ని వర్గాలకు ప్రాధాన్య  ఇస్తూ అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు కేఏ పాల్ తెలిపారు.

Read More  పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. : రేవంత్, ఈటల పై క‌విత ఫైర్

కాంగ్రెస్ పార్టీ టికెట్లను రేవంత్ రెడ్డి అమ్ముకున్నట్లు ప్రజాశాంతి పార్టీలో వుండదన్నారు. కేవలం రూ.10 వేలు గూగుల్ పే లేదా ఫోన్ ఫే చేసి రెజ్యుమ్ పంపించాలని... వారిని తమ కోర్ కమిటీ కలుస్తుందని పాల్ తెలిపారు. ఇలా దరఖాస్తు చేసుకున్నవారిలోంచి పోటీలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేస్తామని కేఏ పాల్ ప్రకటించారు. 

ఇలా దరఖాస్తులను ఆహ్వానించిన కేఏ పాల్ తాజాగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు రెండో జాబితాలో ప్రకటించనున్నట్లు పాల్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ప్రజాశాంతి పార్టీకి అండగా నిలవాలని కేఏ పాల్ కోరారు.