Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ మూడో అభ్యర్ధుల జాబితా విడుదల: 35 మందికి చోటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు  ఫోకస్ పెట్టాయి.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రకటనతో పాటు  ప్రచారంపై  కేంద్రీకరించాయి. 

telangana assembly elections  2023:BJP Releases  third list of candidates lns
Author
First Published Nov 2, 2023, 2:17 PM IST

హైదరాబాద్: బీజేపీ మూడో అభ్యర్థుల జాబితా గురువారం నాడు విడుదలైంది.  35 మందితో మూడో జాబితాను  కమలదళం ఇవాళ విడుదల చేసింది.  ఇతర పార్టీల నుండి  పార్టీలో చేరిన వారికి కూడ మూడో జాబితాలో  బీజేపీ టిక్కెట్లు కేటాయించింది. ఇవాళ విడుదల చేసిన జాబితాలో  13 మంది బీసీలకు కేటాయించింది బీజేపీ.ఎస్సీ ఐదు, ఎస్టీ 3, 14 మంది ఓసీలకు  టిక్కెట్లను కేటాయించింది కమలం పార్టీ.

 

గత నెల  22న  52 మందితో తొలి జాబితాను  బీజేపీ విడుదల చేసింది. గత నెల  27న ఒకే ఒక్క అభ్యర్ధితో బీజేపీ  రెండో జాబితాను విడుదల చేసింది. ఇవాళ  35 మందితో  మూడో జాబితాను విడుదల చేసింది  బీజేపీ.


మూడో జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే

1.మంచిర్యాల-వీరబెల్లి రఘునాథ్
2.ఆసిపాబాద్-అజ్మీరా ఆత్మారాం నాయక్
3.బోధన్-వడ్డె మోహన్ రెడ్డి
4.బాన్సువాడ-ఎండల లక్ష్మీనారాయణ
5.నిజామాబాద్ రూరల్-దినేష్
6.మంథని-చందుపట్ల సునీల్ రెడ్డి
7.మెదక్-పంజా విజయ్ కుమార్
8.నారాయణఖేడ్- జె.సంగప్ప
9.ఆంథోల్- బాబుమోహన్
10.జహీరాబాద్-రామచంద్ర రాజనర్సింహ
11. ఉప్పల్-ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్
12.ఎల్ బీ నగర్-సామ రంగారెడ్డి
13.రాజేంద్రనగర్-తోకల శ్రీనివాస్ రెడ్డి
14.చేవేళ్ల- కెఎస్ రత్నం
15. పరిగి-మారుతి కిరణ్
16. ముషీరాబాద్-పూస రాజు
17.మలక్ పేట-సురేందర్ రెడ్డి
18.అంబర్ పేట-కృష్ణయాదవ్
19. జూబ్లీహిల్స్-లంకల దీపక్ రెడ్డి
20.సనత్ నగర్-మర్రి శశిధర్ రెడ్డి
21.సికింద్రాబాద్-మేకల సారంగపాణి
22.నారాయణపేట-కె.రతంగ్ పాండురెడ్డి
23.జడ్చర్ల-చిత్తరంజన్ దాస్
24.మక్తల్-జలంధర్ రెడ్డి
25.వనపర్తి-ఆశ్వథామరెడ్డి
26. అచ్చంపేట-దేవని సతీష్ మాదిగ
27.దేవరకొండ-కేతావత్ లాలునాయక్
28.హుజూర్ నగర్-చల్లా శ్రీలత రెడ్డి
29.నల్గొండ-మాదగాని శ్రీనివాస్ గౌడ్
30.ఆలేరు-పడాల శ్రీనివాస్
31.పరకాల-కాళి ప్రసాద్ రావు
32.పినపాక-పొడియం బాలరాజు
33. పాలేరు-నూనె రవికుమార్
34. సత్తుపల్లి-రామలింగేశ్వరరావు
35.షాద్ నగర్- అందె బాబయ్య

also read:జేపీ నడ్డా నివాసంలో బీజేపీ తెలంగాణ నేతల భేటీ: మూడో జాబితా నేడు ఫైనల్ చేసే చాన్స్

ఇతర పార్టీల నుండి  వలసలు కొనసాగే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. మరో వైపు జనసేనకు కనీసం తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని బీజేపీ భావిస్తుంది.  ఇంకా  31 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా  19 అసెంబ్లీ స్థానాలను ప్రకటించాల్సి ఉంది.ఈ జాబితా  ప్రకటించిన తర్వాతే బీజేపీ  నాలుగో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios