తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది.  అయితే.. ఈ నేపధ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే..ఇక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుందో తెలుసుకుందాం..

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.

ఈ నేపధ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ లో 9 స్థానాలు ఉండగా.. 4 స్థానాలను కాంగ్రెస హస్త గతం చేసుకుంది.మరోవైపు..కమలం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. గులాబీ పార్టీ కేవలం ఇద్దరూ మాత్రమే అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది.

Nizamabad Assembly Election Results: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!

నెం.నియోజకవర్గంగెలుపొందిన అభ్యర్ధిపార్టీ 
1ఆర్మూర్పైడీ రాకేష్బీజేపీ
2బోధన్సుదర్శన్ రెడ్డికాంగ్రెస్ 
3జుక్కల్ (ఎస్సీ)లక్ష్మికాంత రావుకాంగ్రెస్
4బాన్సువాడపోచారం శ్రీనివాస్బీఆర్ఎస్
5ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావుకాంగ్రెస్
6కామారెడ్డికే.వెంకట్ రమణ రెడ్డిబీజేపీ
7నిజామాబాద్ అర్బన్సూర్య నారాయణబీజేపీ
8నిజామాబాద్ రూరల్ఆర్. భూపతి రెడ్డికాంగ్రెస్
9బాల్కొండవేముల ప్రశాంత్ రెడ్డిబీఆర్ఎస్