సారాంశం

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది.  ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ అభ్యర్థి పట్లోల్ల సంజీవరెడ్డి గెలిచారు. 
 

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోల్ల సంజీవరెడ్డి గెలిచారు. ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరపున ఎం భూపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా జనవాడే సంగప్ప పోటీ చేశారు. ఎం భూపాల్ రెడ్డి నుండి సంజీవ రెడ్డికి గట్టి పోటీ ఎదురైంది. చివరికి సంజీవ రెడ్డినే విజయం సాధించింది. ప్రజలు సంజీవ రెడ్డిని గెలిపించారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కుమారుడైన సంజీవ రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. 

మొత్తంగా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తాజా సమాచారం ప్రకారం 11 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మరో 56 చోట్ల లీడింగ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ అనూహ్యంగా పరాజయం వైపుగా వెళుతుంది. అదే సమయంలో బీజేపీ తన ఓటు షేర్ మెరుగు పరుచుకుంది. 2018తో పోల్చితే గౌరవప్రదమైన సీట్లు రాబడుతుంది. ఎమ్ఐఎమ్ కి బీజేపీ నుండి షాక్ తగిలినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎమ్ఐఎమ్ ఇలాఖాలో బీజేపీ ప్రభావం చూపింది. 

ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్