Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Election Results 2023: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే.. ?

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఉద్యమాల గడ్డ కరీంనగర్. అలాంటి కరీంనగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం..

Telangana Assembly Election Results 2023 Karimnagar constituencies wise winners KRJ
Author
First Published Dec 4, 2023, 12:24 AM IST

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.

ఈ నేపధ్యంలో ఉద్యమాల గడ్డ కరీంనగర్. అలాంటి కరీంనగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ లో 9 స్థానాలు ఉండగా.. 4 స్థానాలను కాంగ్రెస హస్త గతం చేసుకుంది.మరోవైపు..కమలం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. గులాబీ పార్టీ కేవలం ఇద్దరూ మాత్రమే అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది.  
 
Karimnagar Assembly Election Results: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!

. నియోజకవర్గం గెలుపొందిన                               అభ్యర్ధి పార్టీ 
 
1 కోరుట్ల కే. సంజయ్ రావు బీఆర్ఎస్ 
2 జగిత్యాల టీ. జీవన్ రెడ్డి కాంగ్రెస్ 
3 ధర్మపురి (ఎస్సీ) లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ 
4 రామగుండం మక్కాన్ సింగ్  కాంగ్రెస్  
5 మంథని దుద్దిళ్ల శ్రీధర్ బాబు  కాంగ్రెస్ 
6 పెద్దపల్లి విజయ రమణారావు కాంగ్రెస్ 
7 కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్
8 చొప్పదండి(ఎస్సీ)   మేడిపల్లి సత్యం  కాంగ్రెస్ 
9 వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ 
10 సిరిసిల్ల కేటీఆర్ బీఆర్ఎస్
11 మానకొండూరు(ఎస్సీ) కే. సత్య నారాయణ కాంగ్రెస్ 
12 హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్
13 హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్  కాంగ్రెస్ 
Follow Us:
Download App:
  • android
  • ios