Telangana Assembly Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అధిక్యం కొనసాగించింది. ప్రభుత్వ ఏర్పాటు సీట్ల విజయాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో విజయం సాధించి 29 స్థానాల్లో లీడ్ లో ఉంది.
Telangana Congress celebrations: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబరాలు మొదలయ్యాయి. స్పష్టమైన అధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫలితాల్లో ముందుకు సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అధిక్యం కొనసాగించింది. ప్రభుత్వ ఏర్పాటు సీట్ల విజయాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో విజయం సాధించి 29 స్థానాల్లో లీడ్ లో ఉంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. బాణసంచా కాలుస్తూ.. తీన్మార్ డ్యాన్సులు ఆడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనీ, ఈ గెలుపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు గిఫ్ట్ గా కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.
