Bandla Ganesh:తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బండ్ల గణేష్ జోస్యం.. ఇంతకీ ఏమన్నారంటే..?
Bandla Ganesh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఆసక్తికరంగా పరిమాణాలు చోటుచేసుకుంటాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Bandla Ganesh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ సమీపిస్తున్న ఆసక్తికరంగా పరిమాణాలు చోటుచేసుకుంటాయి. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు గెలుపుపై అన్ని పార్టీలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము అధికారం చేపడుతామంటే.. తాము అధికారాన్ని కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ నమ్మకంగా చెపుతున్నాయి. ఎవరూ ఎన్ని ఆశలు పెట్టుకున్న.. ఎంత దీమాగా ఉన్నా.. తెలంగాణ ప్రజానీకం ఏ పార్టీకి అధికార పగ్గాలు అప్పగిస్తారో డిసెంబర్ 3వరకు వేచి చూడాల్సిందే..
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సినీ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నాడు గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. తాను షాద్ నగర్ లో పర్యటించాననీ, తన మిత్రుడు వీర్లపల్లి శంకర్ నామినేషన్ వేస్తే.. ఊరు దాటడానికి గంట పట్టిందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో తనకు నచ్చిన విధంగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ, ప్రజల అభిప్రాయాలను మార్చలేమని అన్నారు. నవంబర్ 30 కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతం సృష్టించబోతుందని ఆయన చెప్పారు.
తాను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తనని, కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటేయలేదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందనీ, పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని దీమా వ్యక్తం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నోత్యాగాలు చేసిందని, నేడు వారి బాటలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నడుస్తున్నారనీ, వారు కూడా ప్రజాసేవకు అంకితమయ్యారని బండ్ల గణేష్ అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, ఇచ్చింది సోనియా గాంధీ అని అన్నారు.
రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తెలంగాణాలోనే మాకాం వేస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనీ, పార్టీలో ముఖ్యమంత్రులు ఎవరనేది సంబంధం లేదని.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు బండ్ల గణేష్. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉన్న మహాకూటమికి మద్దతుగా బండ్ల గణేష్ ప్రచారం చేశారు. ఓ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలవకుంటే.. 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానని సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. ఈ బ్లేడ్ చాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.