Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బడ్జెట్‌ 2021-22 : వ్యవసాయ రంగానికి పెద్దపీట

2021 22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 

Telangana Assembly Budget Session 2021 Highlights - bsb
Author
Hyderabad, First Published Mar 18, 2021, 1:24 PM IST

2021 22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 

- మెట్రో రైలు కోసం వెయ్యి కోట్లు.. పురపాలక పట్టణాభివృద్ధి కోసం 15,030 కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖ కోసం 6,295 కోట్లు 
- పాఠశాల విద్య కోసం 11,735 కోట్లు 
- ఉన్నత విద్య కోసం 1,873 కోట్లు 
- విద్యుత్ రంగానికి 11,046 కోట్లు,  పరిశ్రమల శాఖకు 3,077 కోట్లు 
- ఐటీ రంగానికి 360 కోట్లు
- దేవాదాయ శాఖకు 720 కోట్లు 
- హోమ్ శాఖకు 6,465 కోట్లు
- ఆర్ అండ్ బీ కి 8,788 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం 750 కోట్లు - పౌరసరఫరాల శాఖకు 2,363 కోట్లు
- చేనేత కార్మికుల సంక్షేమానికి 338 కోట్లు, బిసి కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు, గీత కార్మికుల సంక్షేమానికి 25 కోట్లు, సాంస్కృతిక పర్యాటక రంగానికి 726 కోట్లు 

- స్త్రీ శిశు సంక్షేమానికి 1502 కోట్లు 
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 11 వేల కోట్లు 
- పంచాయితీ గ్రామీణ అభివృద్ధి శాఖ కు 29,271 కోట్లు
- సాగునీటి రంగానికి 16,931 కోట్లు 
- ఆసరా పింఛన్ల 11700 28 కోట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 2,750 కోట్లు 

- రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యవసాయం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ఈసారి బడ్జెట్లో ఆ రంగానికి దాదాపు 25 వేల కోట్లు కేటాయించింది. మరోసారి చేయూతనందించింది. ఈసారి బడ్జెట్లో రైతుబంధు కోసం 14,800 కోట్లు కేటాయించగా, రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు, రైతు బీమా కోసం 1200 కోట్లు కేటాయించింది.

- రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు750 కోట్లు, నూతన సచివాలయం నిర్మాణానికి 610 కోట్లు, మత్స్య శాఖకు 1,730 కోట్లు

- దేవాదాయ శాఖకు 720 కోట్లు, అటవీశాఖకు 1,276 కోట్లు, ఆర్టీసీకి 1,500 కోట్లు కేటాయించారు 2021

- 2021 22 ఆర్థిక సంవత్సరానికిగానూ మొత్తం 2,30,825.96 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టగా ఇందులో రెవెన్యూ వ్యయం 1,69,383.44 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ. 29,046.77కోట్లు, రెవెన్యూ మిగులు. రూ. 6 ,743.50కోట్లు, ఆర్థిక లోటు 45,509.60 కోట్లుగా ఉంది. 

-  ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ శాసనసభలో రెండోసారి బడ్జెట్ ను విజయవంతంగా ప్రవేశపెట్టారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అన్నారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్ ఉంటుందని ఆయన ఆకాంక్షించారు.

-జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు. 

- 2021 22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మండలిలో శాసన సభ వ్యవహారాల మంత్రి పి ప్రశాంత్ రెడ్డిబడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. సంక్షేమం, అభివృద్ధి ప్రధానాంశాలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగేలా ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది, అలాగే రైతుబంధు, రుణమాఫీ కి భారీగా నిధులు కేటాయించింది, దీంతోపాటు ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీకి సంబంధించిన నిధుల ప్రతిపాదన బడ్జెట్ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios