తలపై 10 వేల రివార్డు.. నిజాంకు చిక్కని చాతుర్యం, మల్లు స్వరాజ్యం పోరాట ప్రస్థానం ఇదే

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. స్వయంగా జమీందారుల కుటుంబంలో పుట్టినప్పటికీ.. భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. అప్పటి నిజాం సర్కార్ ఆమె తలపై 10 వేల రివార్డు ప్రకటించినా.. ఎవ్వరికీ చిక్కకుండా తప్పించుకున్నారు  స్వరాజ్యం.

telangana armed struggler mallu swarajyam life history

మల్లు స్వరాజ్యం (mallu swarajyam) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ‘స్వరాజ్‌’ అనే నినాదం పట్ల ప్రభావితులై ఆమెకు స్వరాజ్యం అనే పేరు పెట్టారు. Maxim Gorkys Mother చదివిన తర్వాత స్వరాజ్యం విప్లవం వైపు మళ్లారు. ఆమె జమీందారు కుటుంబంలో జన్మించిన.. 12 ఏళ్లకే  పోరుబాట పట్టి ప్రజల మధ్య తిరిగారు. వెట్టిచాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ పిలుపు మేరకు ఉద్యమాలు చేసింది. వెట్టిచాకిరీ బాధితులకు బియ్యాన్ని పంపిణీ చేసింది. ఇందులో తన కుటుంబానికి చెందిన భూముల్లోని ధాన్యం కూడా ఉంది.

16 ఏళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం బందూక్​ చేతబట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. భూస్వాములు, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తన భర్త మల్లు వెంకట నర్సింహా రెడ్డి, సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి‌తో తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్నారు. ఆ పోరాటంలో మహిళా కమాండర్‌గా పనిచేసిన మల్లు స్వరాజ్యం తలపై నిజాం ప్రభుత్వం అప్పట్లోనే 10 వేల రూపాయల రివార్డు ప్రకటించింది. అయినప్పటికీ ఆమె వారికి చిక్కకుండా తన పోరును కొనసాగించింది. అయితే తనను ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని మల్లు స్వరాజ్యం చెప్పేవారు.

కార్మికుల వేతనాల గురించి, రైతు సమస్యలపై మల్లు స్వరాజ్యం రాజీలేని పోరాటం చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాట పరిధిని విస్తరించి జమీందారుల నుంచి భూమిని లాక్కొని పేదలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్టు ముఖ్య నాయకురాలిగా మల్లు స్వరాజ్యం ఎదిగారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలిగా మ‌ల్లు స్వ‌రాజ్యం పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యంకు ఒక కుమార్తె. ఆమె పేరు పాదూరి కరుణ ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడి పేరు మల్లు గౌతమ్ రెడ్డి ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు . చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డికి ఇద్దరు కుమారులు . వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా.. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా పని చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios