రెండు రోజులుగా ఆయన కోసం వెయిటింగ్... అయినా దక్కని అపాయింట్ మెంట్: నిరంజన్ రెడ్డి సీరియస్

తెలంగాణ రైతాంగం కోసం న్యూడిల్లీకి వచ్చిన మంత్రుల బృందం కేవలం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోసం రెండు రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.  

telangana agriculture minister niranjan reddy serious on union minister piyush goyal

న్యూడిల్లీ: తెలంగాణ రైతుల (telangana farmers) పక్షాన దేశ రాజధాని డిల్లీకి (new delhi) వచ్చిన మా మంత్రుల బృందానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (piyush goyal) అపాయింట్ మెంట్ ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjan reddy) ఆరోపించారు. శనివారం సాయంత్రం నుంచి న్యూఢిల్లీలో తెలంగాణ రైతాంగం పక్షాన మంత్రి గోయల్ కోసం వేచి ఉన్నామని... అయినప్పటికి కలవడానికి సమయం ఇవ్వడంలేదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 

తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం (telangana ministers team), టిఆర్ఎస్ ఎంపీ (trs mps)లు మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రైతాంగం సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళదామనుకుంటే... మేము ఇష్టం ఉన్నప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తాం... అప్పుడు రండి.. ఇప్పుడు రండి అనే ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మేము వచ్చే ముందే అపాయింట్ మెంట్ ఆడిగామని... కానీ కేవలం పీయూష్ గోయల్ ను కలవడానికే రెండు రోజులుగా వేచి ఉండాల్సింది వచ్చిందన్నారు. 

''కేంద్ర మంత్రి గోయల్ అపాయింట్ కోసం శనివారం నుండి ప్రయత్నిస్తున్నాం. అయితే నిన్న, మొన్న (శని, ఆదివారం) ఆయన ముంబైలో ఉన్నారని వారి కార్యాలయం చెప్పింది. ఇవాళ న్యూడిల్లీకి ఆయన వచ్చినట్లు తెలిసి మా పార్టీ ఎంపీ కేశవరావు (keshav rao) ఫోన్లో సంప్రదించారు. మా మంత్రుల బృందం, ఎంపీలు మిమ్మల్ని కలవాలని వేచి ఉన్నారని చెప్పారు. అందుకు కేంద్ర మంత్రి గోయల్ పార్లమెంట్ రండి... అక్కడికి వచ్చాక చెప్తాం అంటున్నారు'' అని తెలిపారు. 

Read More  వ‌రి ధాన్యం కొనాల‌ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళ‌న‌లు

''తెలంగాణ రైతుల కోసం, వారి ప్రయోజనాల కోసం మేము న్యూడిల్లీకి వచ్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది. మేము ఎంతసేపయినా వేచి ఉంటాం.. ఒక్క 5నిమిషాలు సమయం ఇస్తే అయిపోతుంది కదా. ఇది సరైనది కాదు. మా రైతుల కోసం మేము ఓర్చుకుంటాం. కానీ ఇది మమ్మల్సి కాదు రైతాంగాన్ని అవమాన పరిచినట్లు ఉంది. రైతుల మొర వినాలని కోరుతున్నాం'' అని వ్యవసాయ మంత్రి కేంద్రాన్ని సూచించారు. 

''తెలంగాణలో 40 లక్షల బియ్యం, 60 లక్షల వరిధాన్యం సేకరణ (paddy procurement)కు ఎంవోయూ కుదిరింది. మీరు ఇచ్చిన టార్గెట్ చాలా స్వల్పమైనది... పెంచాలని కేంద్రాన్ని కోరాం. ఇందుకోసం ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి కెసిఆర్ (KCR) ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించారు. అయినా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు'' అని మండిపడ్డారు. 

''రా రైస్ ఎంతైనా కొంటామని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పారు. నోటి మాట చెప్పడం వేరు... లిఖిత పూర్వకంగా చెప్పడం వేరు. నోటి మాటతో చెల్లుబాటు కాదు. కాబట్టి ఎంత తీసుకుంటారో లిఖిత పూర్వకంగా చెప్పండి'' అని నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. 

Read More  Telangana: ఢిల్లీలో తెలంగాణ క్యాబినేట్ మ‌కాం.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం.. !

''తెలంగాణలో ఇవాళ సాయంత్రం లేదా రేపటికి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్ చేరుకుంటాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 6,952 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేసిన ఘనత తెలంగాణది. రైతుల ధాన్యం సేకరణకు ఇంకా 2, 3 రోజులు పడుతుంది. మార్కెట్ యార్డులో ధాన్యంలో తేమ కోసం అరబెడతారు. ఇంకా 10-15 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద ఉంది'' అని తెలిపారు. 

''భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి ఖమ్మంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా కోతలు జరగాల్సి ఉంది. ఇంకా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వచ్చేది ఉంది. రాష్ట్రంలో ఇంకా 5 లక్షల ఎకరాల్లో వరి కోత ఇంకా ఉందని అంచనా.  కాబట్టి కేంద్రం ఎంత తీసుకుంటారో రాతపూర్వకంగా చెబితే మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం'' అని నిరంజన్  రెడ్డి తెలిపారు.  

''నిన్న కిషన్ రెడ్డి (kishan reddy) కూడా రా రైస్ మొత్తం కొంటామని చెప్పారు. కిషన్ రెడ్డి కన్ ఫ్యూజ్ అవుతున్నారు. రాష్ట్రంలో గోడౌన్లు ఖాళీ లేవని ఎఫ్ సిఐ అధికారులే చెబుతున్నారు. తెలంగాణలో 10లక్షల మిల్లింగ్ కెపాసిటీ ఉంది. మిల్లింగ్ చేసిన బియ్యం రెడీగా ఉంది.. కానీ కేంద్రం తీసుకెళ్లడం లేదు. కానీ రాష్ట్రమే ఇవ్వలేదని కిషన్ రెడ్డి మాపై నెపం వేయడం విడ్డూరంగా వుంది'' అన్నారు. 
 
 
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios