జుట్టు అంటే... ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అది ఎక్కడ ఊడిపోతుందో అని బెంగ కూడా ఉంటుంది. ముందు నుంచే జుట్టు రాలిపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే... కేవలం ఈ జుట్టు కోసం ఓ యువకుడు  ప్రాణాలు తీసుకున్నాడు. చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుందనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మాదాపూర్ లో చోటుచేసుకుంది.

AlsoRead మేనమామ చేతుల్లో నుంచి జారి కిందపడి... పసికందు మృతి...

పూర్తి వివరాల్లోకి వెళితే... మాదాపూర్ లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి కొండాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఎంబీఏ చదువుతుండగా... చిన్న కుమారుడు(18) జేఈఈ పరీక్షలకు సన్నద్ధమౌతున్నాడు.

యువకుడికి సైనస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో జట్టు ఎక్కువగా రాలిపోతోంది. 20 ఏళ్ల రాకముందే.. దాదాపు బట్టతల వచ్చేసింది. దీంతో... తన జుట్టు మొత్తం రాలిపోతోందని రోజూ మదనపడేవాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి బాధపడేవాడు.

కాగా.. సోమవారం ఉదయం అతను స్నానానికని చెప్పి బాత్రూమ్ కి వెళ్లాడు. ఎంత సేపైనా బయటకు రాకపోవడంతో తల్లికి అనుమానం కలిగింది. దీంతో వెంటనే భర్త సహాయంతో తలుపులు పగలకొట్టి చూడగా... ఉరివేసుకొని కనిపించాడు.

జుట్టు ఊడిపోతుందనే బాధతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసి మరీ చనిపోవడం గమనార్హం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.