తెలంగాణ అసెంబ్లీ నేటి ఉదయం పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పిఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తీర్మానం పాస్ చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజే... ఈ చట్టంపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పిన కేసీఆర్ అన్నట్టుగానే నేటి ఉదయం సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ స్పీకర్ కు చర్చ ప్రారంభించవలిసిందిగా కోరారు. 

ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో వివరిస్తూ... 500 ఎకరాల ఆసామి కుటుంబంలో జన్మించిన తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని, ఇక సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు?

Also read; అవును, దేశద్రోహమే: సీఏఏపై కేసీఆర్ వ్యాఖ్యల మీద బిజెపి ఎంపీలు

అంతే కాకుండా వేరే దెగ్గరకు వలసలు వెళ్లే వారికి ఇలా డాక్యూమెంట్లు చూపించమని అడగడం ఎంతవరకు సబబని అన్నారు? చాలా మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్తారని, అలా వెళ్ళినప్పుడు ప్రయాణంలో వారు గనుక వారి పాత్రలను కోల్పోయినా, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడి వాడివే అని నిరూపించుకోమని అన్న చాలా కష్టమైపోతుందని కేసీఆర్ అన్నారు. 

ఇలా చెబుతూనే... బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఉదాహరణగా చూపెట్టారు. రాజాసింగ్ లోధా సామజిక వర్గానికి చెందినవారని. ఆయన పూర్వికులు ఎప్పుడో 100 నుంచి 200 ఏండ్ల కింద బందెలఖండ్ ప్రాంతం నుండి వలస వచ్చారని, ఆయన తెలంగాణ వ్యక్తి కాదని అన్నారు. 

Also read: సిఏఏ వ్యతిరేక తీర్మానం ప్రతులు చించేసిన రాజాసింగ్: అసెంబ్లీలో ఆందోళన

వాస్తవానికి దూల్ పేట్ ఏరియాలో ఉండేవారంతా తెలంగాణ వారు కాదని కానీ వచ్చి ఉంటున్నారు. అలానే తెలంగాణ వారు చాలామంది వేరే చోట్లకు కూడా వెళ్లారని, బల్లార్షా మునిసిపల్ చైర్మన్ తెలంగాణ వాడని, విదర్భ ప్రాంతంలో చాలామంది తెలంగాణ వారు అక్కడ పదవుల్లో కొనసాగుతున్నారని కేసీఆర్ అన్నారు. 

ఇలా లౌకిక పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నటికీ సి ఏ ఏ ను సమర్థించదని, [పార్లమెంటులో కూడా వ్యతిరేకించిందని, ఇప్పుడు అసెంబ్లీలో కూడా వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని పాస్ చేయడానికి నిశ్చయించుకున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు.