హైదరాబాద్: అన్నదాతల ఆందోళన దేశానికి మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. భారత్ బంద్ లో భాగంగా  ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లో నిర్వహించిన రాస్తారోకోలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాజ్యసభలో మెజారిటీ లేకున్నా కూడ తలుపులు మూసి ఈ బిల్లును ఆమోదించుకొన్నారని ఆయన ఆరోపించారు. మందబలంతో పార్లమెంట్ లో బిల్లును ఆమోదించుకొన్నారన్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారని  కేటీఆర్ చెప్పారు.

also  read:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కేసీఆర్ కు భట్టి డిమాండ్

రైతులకు కాకుండా కేంద్రం కార్పోరేట్ శక్తులకు వంత పాడుతోందని ఆయన విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. ఎంఎస్‌పీపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. కేంద్రానికి పైపై పలుకులే తప్ప రైతులకు న్యాయం చేయాలన్న సోయి లేదని ఆయన విమర్శించారు.కార్పోరేట్ శక్తులతో పోట్లాడే శక్తి  రైతులకు ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.

also read:భారత్ బంద్: షాద్‌నగర్ లో రాస్తారోకోలో పాల్గొన్న కేటీఆర్

వ్యవసాయ మార్కెట్లతో మద్దతు ధర వస్తోందన్న నమ్మకం రైతుల్లో ఉందన్నారు. కొత్త బిల్లులతో మార్కెట్ శక్తులకే ప్రయోజనం కలుగుతోందని చెప్పారు.
ఈ కొత్త చట్టాలను వెనక్కి తీసుకొనే వరకు దీర్ఘకాలిక పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.