హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ షాద్‌నగర్ లో హైద్రాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై టీఆర్ఎస్ రాస్తారోకోకు దిగింది. తెలంగాణ మంత్రి కేటీఆర్  ఈ రాస్తారోకోలు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ తో పాటు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్  కె. కేశవరావు కూడ ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు.  రైతుల ఆ:దోళనకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

 

 

 

 

నూతన వ్యవసాయ చట్టాలను తమ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ కొత్త చట్టాలను అమలు చేయడం ద్వారా రైతులకు లాభం కంటే  నష్టమే ఎక్కువగా కలుగుతోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణలో వ్యాపారులు కూడ ఈ బంద్ కు మద్దతు తెలపాలని టీఆర్ఎస్ కోరింది. కనీసం రెండు గంటలపాటు  దుకాణాలను మూసివేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కోరిన విషయం తెలిసిందే.

షాద్‌నగర్ లో రోడ్డుపై  బైఠాయించిన కేటీఆర్, కేకే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు ప్ల కార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

also read:భారత్ బంద్: తెలంగాణలో డిపోలకే పరిమితమైన బస్సులు, నిరసన ప్రదర్శనలు

టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులంతా ఈ రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు.రాష్ట్రంలో బీజేపీ మినహా అన్ని పార్టీలు ఈ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.