Asianet News TeluguAsianet News Telugu

రాక్షసులతోనే కొట్లాడాం.. మీరో లెక్కా, ఒళ్లు దగ్గర పెట్టుకోండి: బీజేపీ- కాంగ్రెస్‌లకు కేసీఆర్ వార్నింగ్

మాటలకు కూడా ఓ హద్దు ఉంటుందని.. బీజేపీ నేతలు పిచ్చి వాగుడు ఆపేయాలని ఆయన హితవు పలికారు. రాక్షసులతోనే కొట్లాడామని.. మీరో లెక్క అంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. 

telagnana cm kcr warning to congress and bjp ksp
Author
Nalgonda, First Published Feb 10, 2021, 5:40 PM IST

కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని, వీరికి తోడు బీజేపీ వాళ్లు చాలా మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీల నాయకత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని.. తమకు ప్రజలు తీర్పునిస్తే అధికారంలోకి వచ్చామని, ఢిల్లీవాడో ఇంకెవరో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎల్పీ నేత పొలం  బాట అని బయల్దేరాడని.. పొలానికి ఏమైందన్నారు. తెలంగాణలో దుస్థితికి కాంగ్రెస్ కారణం కాదా అని సీఎం నిలదీశారు. కాంగ్రెస్‌కు తెలంగాణ అనే అర్హత కూడా లేదని.. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు.

గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చింది.. ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు అనుకూలంగా కడుతుంటే నోరు మూసుకుని కూర్చున్నదెవరు..? అని కేసీఆర్ నిలదీశారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అన్నా కాంగ్రెస్ నేతలు ఎదురు తిరగలేదని ఆయన దుయ్యబట్టారు.

నల్గొండకు ప్రాజెక్టులు మంజూరు చేస్తే కమీషన్ల కోసమని అంటున్నారని.. మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ఒక తరాన్నే నాశనం చేసిందని.. ఒక్కరైనా పోరాటం చేశారా అని ఆయన ప్రశ్నించారు.

ఫ్లోరైడ్ భూతాన్ని వంద శాతం తరిమేశామని.. గతంలో అన్యాయాన్ని ప్రశ్నించని వాళ్లు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పొలాలను ఎండబెట్టినా ఎవరూ మాట్లాడలేదని.. మేం చేతులు ముడుచుకుని కూర్చొం అంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాటలకు కూడా ఓ హద్దు ఉంటుందని.. బీజేపీ నేతలు పిచ్చి వాగుడు ఆపేయాలని ఆయన హితవు పలికారు. రాక్షసులతోనే కొట్లాడామని.. మీరో లెక్క అంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios