Asianet News TeluguAsianet News Telugu

రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ.. ఎక్కడంటే ?

ఆదిలాబాద్ జిల్లా మావల తహసీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆఫీసులోనే బాధితుడి నుంచి ఆదివారం వారు డబ్బులు తీసుకుంటుండగా.. అక్కడే వేచి ఉన్న అధికారులకు చిక్కారు.

Tehsildar , Revenue Inspector caught by ACB for taking bribe from farmer..ISR
Author
First Published Sep 25, 2023, 6:53 AM IST

ఓ రైతుకు 14 ఎకరాల భూమి ఉంది. కానీ పాసు పుస్తకాల్లో పలు పొరపాట్లు ఉన్నాయి. దీనిని సరిదిద్దాలని భావించి ఆ రైతు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ఆ రైతు గోడును విని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో విసిగెత్తిపోయిన సదరు రైతు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనతో డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డబ్బులు చేతులు మారుతున్న క్రమంలో ఏసీబీ అధికారులు ఆ రెవెన్యూ అధికారులను పట్టుకున్నారు. 

అప్పు చెల్లించలేదని.. దళిత మహిళను వివస్త్ర చేసి.. విచక్షణరహితంగా.. ఆపై మూత్ర విసర్జన..

మావల మండలానికి తహసీల్దార్ గా పని చేస్తున్న సుల్తానా, ఆర్ఐ (రెవెన్యూ ఇన్ స్పెక్టర్) హన్మంతరావు రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీ అధికారులకు చిక్కారు. సెలవు రోజైన ఆదివారం కూడా వారు డబ్బులు తీసుకునేందుకే ఆఫీసుకు వచ్చారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ టౌన్ కు చెందిన యాతేంద్రనాథ్ యాదవ్ కు 14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మావల శివారులోని 181/25 అనే సర్వే నెంబర్ లో ఉంది. అయితే ఈ భూమికి సంబంధించిన పాసు పుస్తకాల్లో పలు పొరపాట్లు వచ్చాయి. 

మెట్రోలో రెచ్చిపోయిన ప్రేమికులు.. అందరూ చూస్తుండగానే లిప్ లాక్స్, హగ్స్.. వీడియో

దీనిని ఆ రైతు యతేంద్రనాథ్ సరిదిద్దుకోవాలని అనుకున్నారు. దీని కోసం అధికారులకు ధరణి పోర్టల్ లో అప్లయ్ చేశారు. అయితే రైతు దరఖాస్తును పరిశీలించి, దానిపై విచారణ జరిపి, ఆ నివేదికను తహసీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జిల్లా కలెక్టర్ కు పంపించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆ అధికారులు రూ.2 లక్షలు ఇవ్వాలని రైతును డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ట్రైన్‌లో ఘరానా చోరీ.. రైలు కదలగానే గన్‌లు తీసి బెదిరింపులు, కాల్పులు.. లూటీ చేసి చైన్ లాగి పరార్

అధికారుల సూచన మేరకు ఆ రైతు.. తహసీల్దార్, ఆర్ కు డబ్బులు ఇవ్వడానికి సిద్దమయ్యారు. వీటిని తీసుకునేందుకు సెలవు దినమైనప్పటికీ.. ఆ అధికారులు ఆదివారం ఆఫీసుకు వచ్చారు. అనంతరం రైతును ఆఫీసుకు పిలిపించారు. పథకంలో భాగంగా బాధితుడు డబ్బులు తీసుకొని ఆఫీసుకు వెళ్లారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు కూడా అక్కడ వేచి ఉన్నారు. బాధితుడి నుంచి రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios