Asianet News TeluguAsianet News Telugu

తీన్మార్ మల్లన్నకు చెప్పు దెబ్బలు పడతాయ్ - టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

తీన్మార్ మల్లన్న హిమాన్షుపై పెట్టిన పోల్ వివాదంగా మారింది. ఈ విషయంలో టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బాల్క సుమన్.. తీన్మార్ మల్లన్నపై ఘాటైన విమర్శలు చేశారు. 

Teenmar Mallanna will be beaten - TRS MLA Balka Suman
Author
Hyderabad, First Published Dec 25, 2021, 3:00 PM IST

తీన్మార్ మ‌ల్లన్న ఇంకో సారి కుటుంబ స‌భ్యుల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడితే చెప్పు దెబ్బ‌లు ప‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆయ‌న విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి మ‌ట్లాడారు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుడిపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని తెలిపారు. రాజకీయాల్లోకి ఫ్యామిలీని లాగ‌డం బీజేపీకి అల‌వాటేన‌ని అన్నారు. ఇదంతా ఆ పార్టీ సంస్కృతి లో భాగమ‌ని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఎలా చెబితే చింత‌పండు న‌వీన్ అలా చేస్తాడ‌ని ఆరోపించారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇలాంటి వ్యూహంతోనే ముందుకు వెళ్లింద‌ని, అలాంటి వ్యూహాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమ‌లు చేయాల‌ని భావిస్తోంద‌ని అన్నారు. ప్ర‌జ‌లు అన్నీగ‌మ‌నించాల‌ని కోరారు. 

సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తాం: కేంద్రమంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు

ప్ర‌తీ ఒక్క‌రికీ ఓపిక‌కు హ‌ద్దు ఉంటుంద‌ని అన్నారు. హిమాన్షుపై అలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకు తీన్మార్ మ‌ల్ల‌న్న ఇప్పుడు చెంప దెబ్బ‌లే తిన్నాడ‌ని, మ‌ళ్లీ ఇలాంటి ప‌నులు చేస్తే చెప్పు దెబ్బ‌లు తినాల్సి వస్తుంద‌ని హెచ్చ‌రించారు. బీజేపీ కుటుంబ స‌భ్యుల‌ను, మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచేలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని ఆరోపించారు. ఇలాంటి ప‌నులు ఆ పార్టీకి మంచివి కావ‌ని అన్నారు. త‌న ఆస్తుల‌పై కూడా బీజేపీ సోష‌ల్ మీడియా టీం విష ప్ర‌చారానికి దిగుతోంద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల అఫిడ‌విట్ చెప్పిన దాని కంటే త‌న వ‌ద్ద ఎక్కువ ఆస్తులుంటే వాటిని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడికి ఇచ్చేస్తాన‌ని తెలిపారు. త‌ప్పుడు ప్రచారం జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని ప్రశ్నించారు. ఈ విష‌యంలో చాలా సార్లు డీజీపీకి ఇత‌ర అఫీషియ‌ల్స్‌కు ఫిర్యాదులు ఇచ్చామ‌ని చెప్పారు.  పోలీస్ డిపార్ట్‌మెంట్ చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని అన్నారు. తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌ల‌ను పోలీసులు సుమోటాగా తీసుకోవాల‌ని అన్నారు. ఈ విష‌యంలో డీజీపీ స్పందించి కార‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. సామాజిక మాధ్య‌మాల‌ను దుర్వినియోగం చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. మినిస్ట‌ర్‌లపై విష ప్ర‌చారం జ‌రుగుతుంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పందించాల‌ని కోరారు. 

ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ .. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే ప్ర‌ధాని ఏం చేస్తున్నారు ? 
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే ప్ర‌ధాని మోడీ ఏం చేస్తున్నార‌ని బాల్క సుమ‌న్ విమ‌ర్శించారు. దేశంలో 8 లక్షల 72 వేల ఉద్యోగాలు కాళీకా ఉన్నాయ‌ని, వాటిని ఎందుకు కేంద్ర ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ఆరోపించారు. నిరుద్యోగం విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ దీక్ష చేస్తానని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. జాతీయంతో పోలిస్తే తెలంగాణ నిరుద్యోగ రేటు చాలా తక్కువ అని అన్నారు. ఈ విష‌యం పార్ల‌మెంట్ లో కేంద్ర ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించింద‌ని అన్నారు. ఈ విష‌యం బండి సంజ‌య్‌కు గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేసింద‌ని అన్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో మంది నిరుద్యోగులు అయ్యార‌ని ఆరోపించారు. హైద‌రాబాద్ వ‌చ్చే ఐటీఐర్ ఎందుకు ర‌ద్ద‌య్యింద‌ని ప్ర‌ధాని మోడీని బండి సంజ‌య్ అడ‌గాల‌ని అన్నారు. సింగ‌రేణిని అమ్మేయాల‌ని కేంద్రం చూస్తోంద‌ని అన్నారు. బండి సంజ‌య్ ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌రని అన్నారు. కేవ‌లం మీడియాలో క‌నిపించేందుకే కాంగ్రెస్ నాయ‌కులు ఆరాట‌ప‌డుతున్నార‌ని ఆరోపించారు. బీజేపీ మీద పోరాటం చేయ‌డానికి ఆ పార్టీకి చిత్తశుద్ధి లేద‌ని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios