Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ .. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు రైల్వేశాఖ (indian railways) శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్, సంక్రాంతి (sankranthi) పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలుసర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (south central railway) తెలిపింది.

scr to run sankranti special trains
Author
Hyderabad, First Published Dec 25, 2021, 2:53 PM IST

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు రైల్వేశాఖ (indian railways) శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్, సంక్రాంతి (sankranthi) పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలుసర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (south central railway) తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. 

ప్రత్యేక రైళ్ల వివరాలు

  • 07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు)
  • 07455 నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ (2, 9, 16, 23, 30 తేదీల్లో)
  • 07456సికింద్రాబాద్‌-విజయవాడ (3,10,17, 24, 31 తేదీల్లో)
  • 07577 మచిలీపట్నం-సికింద్రాబాద్‌ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30 తేదీల్లో)
  • 07578 సికింద్రాబాద్‌-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30 తేదీల్లో)
  • 07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28 తేదీల్లో)
  • 07606 అకోలా-తిరుపతి (9, 16, 23, 30 తేదీల్లో) 
Follow Us:
Download App:
  • android
  • ios