Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలోకి చేర‌నున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. ఎప్పుడంటే?

తీన్మార్ మల్లన్న బీజేపీలో చేర‌నున్నారు. ఈ మేరకు ఆయ‌న మంగళవారం(డిసెంబర్ 7) బీజేపీలో చేరనున్నట్లు మల్లన్న అధికారికంగా ప్రకటించారు.
 

Teenmaar Mallanna Will Joing Bjp On 7th December Confirmed
Author
Hyderabad, First Published Dec 6, 2021, 10:27 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

Teenmaar Mallanna: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలో అస‌లు ప్ర‌తి ప‌క్ష‌మే లేద‌నుకున్న సీఎం కేసీఆర్ కు ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ లు తలనొప్పిగా మారాయి. ఇందులో బీజేపీ    స్పీడ్ చూస్తుంటే.. కేసీఆర్ కు వ‌ణుకుపుడుతున్న‌ట్లు అనిపిస్తోంది. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత‌.. బీజేపీ మ‌రింత జోరు పెంచింది. పార్టీలో కీలక నాయ‌కుల‌ను చేర్చుకుంటూ బ‌లోపేతం చేయాల‌ని భావిస్తోంది. 

ఈ క్ర‌మంలో ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీ(BJP)లో చేర్చుకోనున్న‌ది. ఆయ‌న చేరిక కూడా కాన్ఫమ్ అయ్యింది. తీన్మార్ టీం డిసెంబ‌ర్ 7 న చేర‌నున్న‌ట్టు అధికారక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. మ‌ల్ల‌న్న కూడా తాను బీజేపీలో చేరేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు.

Read Also: https://telugu.asianetnews.com/telangana/tngo-tgo-leaders-press-meet-on-employee-bifurcation-in-telangana-r3nf7v

ఇప్ప‌టికే జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర బీజేపీ నేతలకు కూడా ఆయ‌నను స్వాగ‌తిస్తున్న‌ట్టు తెలుస్తుంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం..  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో తీన్మార్ మల్లన్న కాషాయ కండువా క‌ప్పుకోనున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో తీన్మార్ మ‌ల్ల‌న్న స్టేట్ బాడీ స‌మావేశ‌మైంది. మల్లన్న క్షేమంగా ఉంటూ, తెలంగాణ ప్ర‌భుత్వం ప‌నీతీరును ఎండ‌క‌ట్టాలంటే.. ఆయ‌న ఆయన బీజేపీలో చేరడమే స‌రైన‌ద‌ని మల్లన్న స్టేట్ టీం తెలిపింది. మ‌ల్ల‌న్న బీజేపీలో చేరినా .. ఆయ‌న‌కు అండ‌గా ఉంటామ‌నీ, గ‌తంలో లాగానే త‌మ కార్యచ‌ర‌ణ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తీన్మార్‌ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ నాయకుడు రజనీకాంత్, క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ నాగయ్య, మీర్‌పేట కార్పొరేటర్‌ ఎడ్ల మల్లేశ్‌ ముదిరాజ్, ఈశ్వరి విలేకరులతో మాట్లాడారు.

Read Also: https://telugu.asianetnews.com/coronavirus-telangana/35-students-test-positive-for-covid-19-in-chalmeda-medical-college-karimnagar-district-r3n94s

మ‌ల్ల‌న్న‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతుండ‌నీ, ఆయ‌న రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభిస్తున్న‌డ‌నే క్రమంలో అక్ర‌మ కేసులు పెట్టార‌ని ఆరోపించింది మ‌ల్ల‌న్న స్టేట్ టీం.  మల్లన్న జైలుకు వెళ్లే సమయంలో 20 కేసులుండగా జైలుకు వెళ్లాక మరో 18 అక్రమ కేసులు పెట్టార‌నీ. అక్రమంగా 73 రోజుల పాటు జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ త‌రుణంలో ఆయ‌న  బీజేపీలో ఉండటమే సరైందని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
 
తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. రాష్ట్ర‌ప్రభుత్వంపై అస‌త్యప్ర‌చారం చేస్తున్న‌డ‌నీ, రాజ‌కీయనేత‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేశారంటూ నమోదైన కేసులో మ‌ల్లన్న అరెస్టయిన విష‌యం తెలిసిందే. తీన్మార్ మల్లన్నపై  38 కేసులు నమోదుకాగా.. అందులో 6 కేసులను కోర్టులు కొట్టేశాయి. మరో 32 కేసులకు సంబంధించి 31 కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్ర‌మంలో ఆయ‌న చంచల్‌గూడ జైల్లో 74 రోజులు పాటు రిమాండ్‌లో ఉన్నారు. గ‌త నెల తొలివారంలో విడుదలైన సంగతి విధిత‌మే.

READ ALSO: https://telugu.asianetnews.com/telangana/196-new-corona-cases-reported-in-telangana-r3e515

ఈ క్ర‌మంలో  తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బీజేపీ నేత‌లు అండ‌గా నిలిచారు. ప‌లు సంద‌ర్భాల్లో జైలుకు వెళ్ళి ప‌ర‌మ‌ర్శించారు. ప్ర‌భుత్వ ప‌నితీరును ఎండ‌క‌డుతున్న‌పై  మల్లన్న పట్ల తెలంగాణ స‌ర్కార్  కక్షపూరితంగా కేసులు న‌మోదు చేసింద‌నీ, జైల్లోనే మర్డర్ చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అలాగే.. ఎంపీ అర్వింద్ కూడా మ‌ల్ల‌న్న‌ను క‌లిసి అండ‌గా నిలిచారు. జైలు నుంచి విడుదల కాగానే బీజేపీలో చేర‌మ‌ని ఆహ్వానిస్తామని అర్వింద్‌ తెలిపారు. 

ఇదే స‌మ‌యంలో మల్లన్న భార్య.. త‌న భ‌ర్త‌ను ఎలాగైనా విడిపించాల‌ని బీజేపీ అధిష్టానికి విజ్ఞ‌ప్తి చేసింది.  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడింది. ఈ ఘ‌ట‌న‌తో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతారని ప్రచారం జోరందుకుంది.  ఇక అంద‌రూ ఊహించినట్లుగానే మంగళవారం(డిసెంబర్ 7) బీజేపీలో చేరనున్నట్లు మల్లన్న అధికారికంగా ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios