Asianet News TeluguAsianet News Telugu

కొత్త జిల్లాలు.. జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన: సీఎస్‌తో భేటీ అనంతరం టీజోవో, టీఎన్జీవో నేతలు

తెలంగాణలో ఉద్యోగుల (telangana government employees) వర్గీకరణ, బదిలీల విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో ఆదివారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ (somesh kumar) భేటీ ముగిసింది. కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని టీజీవో అధ్యక్షురాలు మమత తేల్చి చెప్పారు. 

TNGO TGO Leaders Press Meet on employee bifurcation in telangana
Author
Hyderabad, First Published Dec 5, 2021, 9:03 PM IST

తెలంగాణలో ఉద్యోగుల (telangana government employees) వర్గీకరణ, బదిలీల విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో ఆదివారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ (somesh kumar) భేటీ ముగిసింది. ఈ సందర్భంగా టీఎన్జీవో (tngo), టీజీవో (tgo) నేతలతో సీఎస్‌ వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యోగుల వర్గీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత టీజీవో అధ్యక్షురాలు మమత (mamata) మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని తేల్చి చెప్పారు. ఉద్యోగులకు నష్టం జరగకుండా కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారం విభజన చేయాలని కోరామని పేర్కొన్నారు. 

సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని మమత చెప్పారు. ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా ఆయా జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు కానున్నాయని .. ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్‌ బాగున్నాయని ప్రశంసించారు. క్లిష్టమైన సమస్యను సీఎం సులభంగా పరిష్కరించారని.. నెలలోపే ఉద్యోగుల ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని మమత వెల్లడించారు. బదిలీ ఆప్షన్ల ప్రక్రియ (options) ఆఫ్‌లైన్‌ విధానంలోనే ఉంటుందని చెప్పారు. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రత్యేక పరిస్థితులును కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరామని మమత తెలిపారు.

Also Read:సర్దుబాటు తర్వాత ఉద్యోగ భర్తీ , డీఏ విడుదలకు గ్రీన్‌సిగ్నల్: టీజీవోలకు కేసీఆర్ హామీ

టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిడ్ల రాజేందర్ (rajender) మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్థానికంగా ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలి అని చెప్పారని రాజేందర్ వెల్లడించారు. త్వరితగతిన ఉద్యోగుల విభజన చేయాలని సీఎస్ దగ్గర సమావేశం అయ్యామని.. ఉద్యోగుల విభజన ఎలా జరగాలని అనేదానిపై ఇవాళ సూచనలు, సలహాలు తీసుకున్నారని రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికి నష్టం జరగకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. 

సీఎం కేసీఆర్ (kcr) రెండు దఫాలుగా చర్చలు జరిపారని.. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని చెప్పామని రాజేందర్ వెల్లడించారు. మా సూచనలు సలహాలు పాటిస్తాం అని వారు తెలిపారని.. భార్యాభర్తలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపామన్నారు. ఎస్సి,ఎస్టీ కులాల వారికి కూడా రోస్టర్ విధానం పాటించాలని కొరామని.. ఉద్యోగుల పని భారం తగ్గించేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని రాజేందర్ ప్రశంసించారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దేశంలో ఎక్కడా లేదని.. 29 రాష్ట్రాల్లో తెలంగాణలో పని చేసే ఉద్యోగులు అగ్రభాగాన ఉన్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు సీఎం కేసీఆర్ మాత్రమే దక్కుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios