హైదరాబాద్ సరూర్‌నగర్‌లో యువకుడి కిడ్నాప్ కలకలం రేగింది. పీఎన్‌టీ కాలనీలో వుంటోన్న సుబ్రమణ్యం అనే యువకుడిని కొట్టి బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో యువకుడి కిడ్నాప్ కలకలం రేగింది. పీఎన్‌టీ కాలనీలో వుంటోన్న సుబ్రమణ్యం అనే యువకుడిని కొట్టి బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. తమ కుమారుడిని కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారు..? ఎందుకు చేశారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred