హైదరాబాద్ కూకట్‌పల్లి జయనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కోతులను తరిమేందుకు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కరెంట్ షాక్ తగిలి దుర్మరణం పాలయ్యాడు.

కోతులను తరుముతున్న సమయంలో ప్రమాదవశాత్తూ అతని చేతిలో వున్న ఐరన్ రాడ్ విద్యుత్ వైర్లను తాకింది. దీంతో దానిలో విద్యుత్ సరఫరా జరిగి కరెంట్ షాక్ తగిలింది.

వెంటనే స్పందించిన స్థానికులు, కుటుంబసభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ టెక్కీ మరణించాడు. అతనిని లోకేశ్‌గా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది.