కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన టెక్కీ రాజేష్ డెడ్ బాడీ లభ్యమైంది.. రాజేష్ అదృశ్యమయ్యాడని పోలీసులకు కుటుంబసభ్యులు పిర్యాదు చేశారు.
కామారెడ్డి: రెండు రోజుల క్రితం అదృశ్యమైన టెక్కీ రాజేష్ అంశం విషాందాంతమైంది. రెండు రోజుల క్రితం సోదరుడి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిన రాజేష్ మృతదేహం ఇవాళ లభ్యమైంది.మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో రాజేష్ డెడ్‌బాడీ లభ్యమైంది. రాజేష్ కన్పించడం లేదని కటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాజేష్ డెడ్‌బాడీ లభించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.రాజేష్ ఎలా చనిపోయాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
