హైదరాబాద్: ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వికారాబాదు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఆ సంఘటన చోటు చేసుకుంది. 

హైదరాబాదులోని కూకట్ పల్లి హైదర్ నగర్ కుచెందిన నాగేందర్ రెడ్డి (22) బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తల్లి మరణించింది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 

ఒంటరితో మానసికంగా అతను క్రుంగిపోయినట్లు కనిపిస్తున్నాడు. దీంతో కొద్ది రోజుల క్రితం తాతకు ఫోన్ చేసి తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని చెప్పారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

తర్వాత తిరిగి రాలేదు. దాంతో బంధువులు, కుటుంబ సభ్యులు అతని కోసం స్నేహితుల వద్ద ఆరా తీశారు. అయినా ఫలితం దక్కలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశఆరు. శనివారం వికారాబాదులోని లాలాగుడా సమీపంలోని వంతెన వద్ద చెట్టుకు ఉరేసుకున్న విషాయన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, తమకు లభించిన ఆధారాలను బట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తాత నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.