అనిల్ కుంబ్లే టీం ఇండియా ప్రధాన కోచ్ గా రాజీనామా చేసిన తరువాత భారత క్రికేట్ లో అనూహ్య మార్పులు వచ్చాయి. పలు రకాలు కాంట్రవర్శీలు జరిగాయి. అయితే నూతన కోచ్ కోసం బీసీసీఐ పెద్ద కసరత్తే జరిపింది. టీం ఇండియా హేడ్ కోచ్ కోసం పది మందికి పైగనే పోటీ పడ్డారు. అందులో ప్రధానంగా మాజీ ఓపేనర్ వీరేంద్ర సేహ్వాగ్, రవీశాస్త్రీ ల మధ్య కొంత సందిగ్థత నెలకోన్నప్పటికీ చివరికి రవిశాస్త్రీకి టీం ఇండియా కోచ్ గా పగ్గాలు అప్పజేప్పారు.

ఇప్పుడు మరో విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అదే రవిశాస్త్రీ కీ టీం ఇండియా కోచ్ గా ఎంత వేతనం అందుకోబోతున్నారు అని విషయం. దీని పైన బాగానే రూమర్లు విస్తరించాయి. మొదట కోచ్ గా రవిశాస్త్రీ సంవత్సరానికి 10 కోట్ల కు పైగా అందుకుంటున్నారు అని ప్రచారం జరిగింది, అయితే కొందరు నేటిజన్లు కోహ్లీ కి క్లోజ్ గా ఉంటే పది కోట్లు సంపాధించవచ్చు అని కామేంట్లు చేశారు.

అయితే ఈ రూమర్లకు చేక్ పెట్టడానికి బీసిసిఐ ఒక ప్రకటన చేసింది, నూతనంగా భారత క్రికేట్ కి కోచ్ గా నియమితులైన రవిశాస్త్రీకి 10 కోట్ల రూపాయలు కేవలం రూమర్ మాత్రమేనని కొట్టిపారేసింది. బీసీసీఐ కోచ్ గా ఎంత వేతనం ఇస్తున్నారు అనే విషయం మాత్రం దాటవేసింది. కానీ రవిశాస్త్రీకి వార్షీక ఆధాయం కింద 7 కోట్ల నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.