మాటల యుద్ధం షురూ చేసిన మోత్కుపల్లి ఆయన బాటలో మరికొందరు తమ్ముళ్లు బాబు ఆదేశాల మేరకే ఎటాక్ మొదలు పెట్టారా? తెలంగాణ టిడిపి తమ్ముళ్లలో అయోమయం  

తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. రేవంత్ బాగోతం బయటపెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నది. రేవంత్ రెడ్డి గత చరిత్రను బయటకు తీస్తున్నది. ఓటుకు నోటు మొదలుకొని రేవంత్ హయాంలో టిడిపిలో జరిగిన తెర వెనుక పరిణామాలను బయటపెడుతున్నది. చంద్రబాబు ఆదేశాలు లేనిదే హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో చీమ కూడా కుట్టదు అన్న విషయం జగమెరిగిన సత్యమే. అందుకే విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఆదేశాలు అందుకున్న వెంటనే మోత్కుపల్లి రంగంలోకి దిగారు. రేవంత్ మీద విరుచుకుపడ్డారు. ఆయన బాటలో నడిచారు మరో నేత అరవింద్ కుమార్ గౌడ్.

తాజాగా మోత్కుపల్లి నర్సింహులు రేవంత్ మీద కరుకుగా మాట్లాడారు. మోత్కుపల్లి ఏమన్నారో.. ఆయన మాటల్లోనే చదవండి. ఓటుకు నోటు కేసులో డబ్బు సంచులతో దొరికిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన అలా దొరికిపోయి పార్టీ పరువు తీశాడు. ఆయన ఏదో చేస్తడని చంద్రబాబు నమ్మిండు. నమ్మి ఘోరంగా మోసపోయిండు. రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి సీనియర్లు కూడా వెళ్లిపోయవడానికి రేవంతే కారణం.

కార్పొరేషన్ ఎన్నికల్లో రేవంత్ ను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించారు కదా? ఆయన ప్రచారం చేసిన తర్వాత జిహెచ్ఎంసిలో ఒక్క సీటు గెలవలేదు కదా? అది పక్కనపెడితే 22 శాతం ఓటు బ్యాంకు ఉండగా ఆయన ప్రచారం తర్వాత 10 శాతానికి పడిపోయింది.

రేవంత్ రేడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు టిడిపికి తీరని నష్టం కలిగించాయి. ఇంకా కలిగిస్తూనే ఉన్నాయి. ఆయన తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేశాడు. రేవంత్ వల్ల పార్టీ క్రెడిబులిటీ మొత్తం పోయింది.

పార్టీ మొత్తాన్ని తన వెంట తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో టిడిపి ని కూకటివేళ్లతో పెకిలించే ప్రయత్నం చేస్తున్నాడు. తన రాజకీయ పబ్బం గడిపేందుకే ఆయన రాహుల్ ను కలిశాడు. అసలు రాహుల్ ను ఎందుకు కలిశాడో చెప్పమంటే చెప్పడంలేదు. పోనీ కలవలేదు అని ఖండించడంలేదు. కలిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తుండు. ఆయనకు ఆ హక్కు ఎక్కడిది?

ఇయ్యాల మీటింగ్ కు రేవంత్ రాడేమో అనుకున్న కానీ.. శరం విడిచి రేవంత్ మీటింగ్ కు వచ్చిండు. మల్లా 24న మీటింగ్ కు ఆయనను పిలవకూడదు అని నేను అంటున్నాను. అని మోత్కుపల్లి ఒక మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇలా తెలంగాణ, ఎపి టిడిపి నేతలు వరుసగా రేవంత్ మీద డోసు పెంచి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎపి ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప ఇప్పటికే రేవంత్ మీద స్పందించారు. ఇక తెలంగాణ నేతలు దూకుడు పెంచారు. మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ లాంటి నేతలంతా గట్టిగానే కౌంటర్ ఇస్తన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దీపావళి వేడకల్లో 30 మంది పోరగాళ్లు గాయపడ్డరు... వీడియో చూడండి.

https://goo.gl/hMBFkQ