హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21న జరుగుతున్న ఉప ఎన్నికల్లో  తమ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని సీపీఎం ను కోరింది టీడీపీ.

బుధవారం నాడు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ బుధవారం నాడు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో  భేటీ అయ్యారు.
హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  తమ పార్టీ అభ్యర్ధికి మద్దతివ్వాలని ఎల్. రమణ కోరారు. 

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరించారు. దీంతో ఈ స్థానంలో సీపీఎం పోటి నుండి తప్పుకొన్నట్టైంది. ఆ పార్టీని తమకు మద్దతివ్వాలని టీడీపీ కోరింది.

అయితే టీడీపీకి మద్దతిచ్చే విషయమై తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో  సరైన పత్రాలు దాఖలు చేయనందున  శేఖర్ రావు నామినేషన్ ను మంగళవారం నాడు తిరస్కరించారు.అయితే సీపీఎం ఎవరికీ మద్దతిస్తోందో అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.