హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వీడతారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్. తాను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు ప్రజల క్షేమం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయమాటలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గ్రామ గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్ ఎన్ని గ్రామాలకు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.  

టీఆరెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదని వారి బాగుకోసం, వారి స్వలాభం కోసం పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ప్రస్తావిద్దామని ప్రయత్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వర్ స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

పేదోళ్లకు గూడు లేదు కానీ కేసీఆర్ కు మాత్రం విలాసవంతమైన భవనమా...?: టీ టీడీపీ నేత ఎల్ రమణ