చౌటుప్పల్ టిిడిపి సభలో రెచ్చిపోయిన నన్నూరి కేసిఆర్ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలొచ్చాయి టిడిపిని ఆంధ్రా పార్టీ అంటే ఖబర్దార్

తెలంగాణ టిడిపి నేత నన్నూరి నర్సిరెడ్డి అధికార టిఆర్ఎస్ పార్టీపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

టిఆర్ఎస్ వాల్లు పొద్దూకాల డార్లింగ్ అనుకుంటూ పొద్దునట్లు డైవర్స్ తీసుకుంటున్నారని సెటైర్ వేశారు.

టిఆర్ఎస్ లో 36 గ్రూపులు తయారైనయని ఎద్దేవా చేశారు.

టిడిపి ని ఆంధ్రా పార్టీ అంటున్న కేసిఆర్ ఇప్పుడు తెలంగాణ సొమ్మునంతా ఆంధ్రా వారికి దోచిపెడుతున్నాడని దుయ్యబట్టారు.

తెలంగాణ సొమ్ము ఈనాడు రామోజీకి దోచిపెట్టిండని ఆరోపించారు.

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పంచ్ డైలాగులతో విమర్శలు గుప్పించారు

నన్నూరి నర్సిరెడ్డి. ఆ వీడియో మీరూ చూడండి మరి.