మేము టిడిపి వీడే ప్రశ్నే లేదు

First Published 22, Dec 2017, 4:28 PM IST
TDP Devender Goud son denies the reports of party defection
Highlights
  • సైకిల్ దిగుతామన్న ప్రచారంలో నిజం లేదు
  • మేము టిడిపిలోనే ఉంటాం
  • మాపై ప్రచారం  విశ్వసనీయత దెబ్బతీసే ప్రయత్నమే

తెలంగాణలో సీనియర్ నేత, టిడిపి రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, ఆయన తనయుడు తెలుగు యువత అధ్యక్షుడు వీరేందర్ గౌడ్ పార్టీ మారతారన్న వార్తలపై వివరణ ఇచ్చారు. వీరేందర్ గౌడ్ ఈమేరకు ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు.

తన తండ్రి, తాను సైకిల్ దిగి వేరే పార్టీలో చేరతామంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తన తండ్రి దేవేందర్ గౌడ్ మొదటి నుంచీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తపించిపోయేవారని అన్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తన తండ్రి మార్గంలో నేనూ నడుస్తున్నానని తెలిపారు. మీడియాలో తాము పార్టీ మారతామంటూ వస్తున్న వార్తలు తమ విశ్వసతనీయతను దెబ్బతీసే ప్రయత్నమేని తెలిపారు.

ఈ వార్తల వల్ల కార్యకర్తల్లో గందరగోళం నెలకొనే ప్రమాదముందన్నారు. ఇలాంటి వార్తలు రాసేముందు తమ వివరణ తీసుకుని ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. వీరేందర్ గౌడ్ మీడియాకు పంపిన ప్రెస్ నోట్ కింద ఉంది చూడండి.

loader