Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో వరదలు: సహాయ చర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు బాబు ఆదేశం

నగరంలోని వరద బాధిత ప్రజలకు సహాయం అందించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు.  ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

TDP Chief Chandrababunaidu orders  party leaders to help flood victims in Hyderabad lns
Author
Hyderabad, First Published Oct 20, 2020, 2:30 PM IST

హైదరాబాద్: నగరంలోని వరద బాధిత ప్రజలకు సహాయం అందించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు.  ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

ఈ జలప్రళయం ముగిసే వరకు హైదరాబాదు వాసులందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.  మీరు జాగ్రత్తగా వుంటూ, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన సూచించారు. మీ భద్రత కోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పారు. 

also read:హైద్రాబాద్‌‌కి వరదలు: ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల సహాయం

అవసరమైన చోట సహాయ సహకారాలను అందించాలి అని టిడిపి నాయకులకు, కార్యకర్తలను ఆయన కోరారు.హైద్రాబాద్ నగరంలో ఈ నెల 13వ తేదీన కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నెల 17వ తేదీన మరోసారి భారీ వర్షం కురవడంతో నగరం మరోసారి నీట మునిగిపోయింది. 

also read:తెలంగాణలో అత్యధిక వర్షపాతం: సాధారణం కంటే 50 శాతం అధికం

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం కూడ హైద్రాబాద్ నగరంలో వరదలకు  కారణంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios