టీసీఎస్ ఉద్యోగి ఒకరు లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. 

టీసీఎస్ ఉద్యోగి ఒకరు లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని జగ్దల్ పూర్ కి చెందిన అపూర్వ చతుర్వేది(36) టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గతంలో హర్యానాలోని గుడ్ గావ్ లో పనిచేయగా.. ఇటీవల హైదరాబాద్ ట్రాన్సఫర్ అయ్యింది.ఇటీవలే నగరానికి భార్య ప్రియ, కుమారుడు ఆరుష్ తో కలిసి నగరానికి వచ్చాడు. గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ లాడ్జిలో మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన ఆయన..బుధవారం ఉదయం కల్లా శవమయ్యాడు.

భార్య ప్రియ నిద్రలేచే సమయానికి భర్త చలనం లేకుండా పడి ఉంటాన్ని గమనించింది. వెంటనే లాడ్జి సిబ్బంది సమాచారం అందించి అంబులెన్స్ కి ఫోన్ చేసింది. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది అప్పటికే అతను మృతిచెందినట్లు గుర్తించారు.

నిద్రలో గుండెపోటుకి గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.