అహా నా పెళ్లంట సినిమాలో కోటా శ్రీనివాసరావు చేసిన కోడి భోజనం ఎన్ని దశాబ్దాలు గడిచినా తెలుగు ప్రజలు ఎవ్వరూ మరచిపోలేదు. ఈ తరాల వాళ్లు కూడా ఆ సినిమా క్లిప్ చూడగానే పెద్దగా నవ్వుతారు. ఆ సీన్ అలా అందరి మదిలో నిలిచిపోయింది. ఆ సినిమాలో ఆయన పిసినారి కాబట్టి కోడిని పైన వేలాడదీసి దాన్ని చూస్తూ  కోడి భోజనం చేశారు.

 

కానీ నవీన కాలంలో పరిస్థితులు మారిపోతున్నాయి. అగ్గువకు కోళ్లు దొరుకున్నాయోమో కానీ టమాటాలు దొరుకుతలేవు. మార్కెట్లో టమాటా ధర 100 రూపాయలు దాటిపోయింది. దీంతో ఓ యువకుడు సరదాగా టమాటా భోజనం చేస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియలోకి వదిలాడు. ప్రస్తుతం టమాటా భోజనం గా ఆ వీడియో రికార్డుల మోత మోగిస్తోంది సోషల్ మీడియాలో.