ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వికారాబాద్‌ జిల్లా తాండూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న వేరొకరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్‌ నంబర్‌-283లో ఓటరు క్రమసంఖ్య-528లో తాటికొండ స్వప్నగా పేరు నమోదై ఉంది. 

చైర్‌పర్సన్‌ పేరు కూడా తాటికొండ స్వప్న, ఆమె భర్త పేరు పరిమళ్‌. అయితే క్రమసంఖ్య 528లో ఉన్న తాటికొండ స్వప్న భర్త పేరు తాటికొండ అశ్విన్‌, ఇంటి చిరునామా గాంధీచౌక్‌ 6-4-160 పేరిట ఉంది. ఎపిక్‌ నంబర్‌-ఎక్స్‌ఎల్‌వీ 0882515గా నమోదై ఉంది. 528లో ఉన్న తాటికొండ స్వప్న.. చైర్‌పర్సన్‌ స్వప్నకు చెల్లెలి వరుస అవుతుందని తెలిసింది. 

ఈ విషయమై 284 బూత్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ఏజెంట్‌, కౌన్సిలర్‌ వరాల శ్రీనివా్‌సరెడ్డి.. 283 బూత్‌లోకి వెళ్లి పరిశీలించారు. చైర్‌పర్సన్‌ పట్టభద్రురాలు కానప్పటికీ ఓటుహక్కు వినియోగించుకోవడంపై ఆరా తీశారు. ఆమె ఓటు వేసినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.