Asianet News TeluguAsianet News Telugu

పవన్‌తో రెడీ: తెలంగాణలో మహాకూటమికి తమ్మినేని చిక్కులు

 తెలంగాణలో టీఆర్ఎస్‌కు  వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు  సీపీఎం ప్రయత్నాలను ప్రారంభించింది. సోదర వామపక్ష పార్టీ సీపీఐ వద్ద  మూడు ప్రతిపాదనలను సిద్దం చేసింది

Tammineni plans to mahakutami  in telangana for 2019 elections
Author
Hyderabad, First Published Aug 31, 2018, 11:00 AM IST


హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్‌కు  వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు  సీపీఎం ప్రయత్నాలను ప్రారంభించింది. సోదర వామపక్ష పార్టీ సీపీఐ వద్ద  మూడు ప్రతిపాదనలను సిద్దం చేసింది.  కాంగ్రెస్‌ పార్టీతో సీపీఐ జత కలిస్తే  తమకు అభ్యంతరం లేదని చెబుతూనే తాము పోటీ చేసే స్థానాల్లో తమకు  సహకరించాలని కోరింది.

2019 ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేకుండా మహా కూటమిని ఏర్పాటు చేయాలని సీపీఎం ప్రతిపాదిస్తోంది.  ఈ విషయమై ఇతర పార్లీలతో ఆ పార్టీ  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇతర పార్టీలతో చర్చిస్తున్నారు.

ఇప్పటికే సీపీఎం .. బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేసింది. బీఎల్ఎఫ్  పేరుతోనే సీపీఎం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంది. అయితే కూటమిలోకి వచ్చే పార్టీలతో చర్చలకు తమ్మినేని  వీరభద్రం ప్లాన్ చేస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీలు లేకుండా ఇతర పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసేందుకు  ప్లాన్ చేస్తున్నారు.  సీపీఐ మాత్రం బీఎల్ఎఫ్ లో చేరేందుకు ఇప్పటివరకు ఆసక్తిని ప్రదర్శించడం లేదు. మరో వైపు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసి పోటీ చేస్తే  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.

కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని సీపీఐ ఆసక్తితో ఉంది. అయితే  సీపీఐ నేతల వద్ద  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మూడు రకాల ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం.

 జనసేన, బీఎల్ఎఫ్, టీడీపీలతో కలిపి కూటమిని ఏర్పాటు చేస్తే  ఆ కూటమిలో చేరేందుకు తమకు అభ్యంతరం లేదని సీపీఎం తేల్చి చెప్పింది.  కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేస్తే తాము ఆ కూటమిలో చేరబోమని సీపీఎం ప్రకటించింది.

మరో వైపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకొని  సీపీఐ పోటీ చేసినా... ఆ స్థానాల్లో  తాము  మద్దతిస్తామని  సీపీఎం ప్రకటించింది. అంతేకాదు బీఎల్ఎఫ్, సీపీఎం అభ్యర్ధులు పోటీ చేసిన స్థానాల్లో  తమకు మద్దతివ్వాలని సీపీఐను సీపీఎం కోరింది.

ఇదిలా ఉంటే  మరో వైపు జనసేనతో  కూడ సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి పొత్తు చర్చలకు రంగం సిద్దం చేశారు. ఏపీ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలో కూడ  కలిసి పనిచేద్దామని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశాడు.

ఈ లేఖపై  జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ  చర్చించింది. పొత్తుల విషయమై  సీపీఎం ప్రతిపాదనపై  జనసేన కూడ సానుకూలంగా ఉంది. అయితే  సీపీఎం, జనసేనల మధ్య పొత్తు విషయమై  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రదంతో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ రెండో తేదీన హైద్రాబాద్‌లో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో కూటమి ఏర్పాటుకు సంబంధించిన విషయమై చర్చించే అవకాశం లేకపోలేదు.  

ఈ వార్తలు చదవండి

తెలంగాణలో పొత్తు: తమ్మినేని లేఖఫై పవన్ కళ్యాణ్ చర్చలు

టీడీపీతో కాంగ్రెస్ పొత్తు: ఉత్తమ్, లక్ష్మణ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ

వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: రేణుకా సంచలనం

Follow Us:
Download App:
  • android
  • ios