ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలో కూడ కలిసి పనిచేద్దామని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనను కోరారు. ఈ మేరకు తమ్మినేని వీరభద్రంతో  చర్చించాలని  జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ నిర్ణయం తీసుకొంది

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలో కూడ కలిసి పనిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనను కోరారు. ఈ మేరకు తమ్మినేని వీరభద్రంతో చర్చించాలని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ నిర్ణయం తీసుకొంది.

ఏపీ రాష్ట్రంలో సీపీఐ, సీపీఎంలతో కలిసి పనిచేస్తామని జనసేన ప్రకటించింది. ఈ మేరకు ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. అయితే ఏ సీట్లలో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలో కూడ ఏపీ తరహాలోనే కలిసి పనిచేయాలని సీపీఎం అభిప్రాయపడుతోంది.ఈ మేరకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనను కోరారు. 

తమ్మినేని చేసిన ప్రతిపాదనపై జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ చర్చించింది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితో నేరుగా చర్చించాలని జనసేన నిర్ణయం తీసుకొంది. ఈ విషయమై త్వరలోనే ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. 

ఇంతకుముందే సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్‌తో చర్చించారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో తెలంగాణలో మురందస్తు ఎన్నికలకు కేసీఆర్ సన్నద్దమౌతున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తమ్మినేని చేసిన ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బీఎల్‌ఎఫ్ తరుపునే పోటీ చేయనుంది. అయితే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఇతర పార్టీలను కూడగట్టేందుకు గాను సీపీఎం ప్లాన్ చేస్తోంది.ఇందులో భాగంగానే జనసేనతో తమ్మినేని ఈ ప్రతిపాదన చేసినట్టు సమాచారం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పార్టీల మధ్య పొత్తులు, కూటములు ఏర్పాటయ్యే అవకాశం కూడ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

టీడీపీతో కాంగ్రెస్ పొత్తు: ఉత్తమ్, లక్ష్మణ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ

వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: రేణుకా సంచలనం

అసెంబ్లీ రద్దు లాంఛనమే: రేపు మంత్రి వర్గ సమావేశం