హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో బీసీలకు నిధులను కేటాయించారని తెలంగాణ  రాష్ట్ర సినిమాటోగ్రపీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 

సోమవారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మరో ఇద్దరు మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి       మీడియాతో  మాట్లాడారు.

Also read:స్వంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: హరీష్ రావు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  బీసీలకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వెనుకబడిన తరగతుల వర్గాలకు  బీసీలకు న్యాయం జరిగిందని  ఆయన చెప్పారు. గొల్ల, కురుమలకు న్యాయం జరిగిందని ఆయన చెప్పారు.

 బీసీలు ఆర్ధికంగా బలపడేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారని ఆయన గుర్తు చేశారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి  సీఎంగా ఉన్న సమయంలో  పేపర్‌పై  బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయన్నారు.కానీ ఆచరణలో మాత్రం కేటాయింపుల మేరకు నిధులను ఖర్చులు  చేయలేదని  ఆయన ఆరోపించారు. 

అసెంబ్లీలోనే సీఎం  ప్రాజెక్టు రీ డిజైన్లపై  పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వడంపై  కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను  తలసాని గుర్తు చేసుకొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు  ద్వారా నీటిని సరఫరా చేస్తే రాజీనామాలు చేస్తామని  కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా  ప్రస్తుతం సాగు, తాగు నీటిని విడుదల చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  
 
బీసీలకు సబ్ ప్లాన్ తాము వద్దనలేదని  మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ కంటే ఎక్కువగా బడ్జెట్ లో నిధులను కేటాయించారని ఆయన గుర్తు చేశారు. బీసీలకు అత్యధికంగా నిధులు కేటాయించినందుకు  సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.