స్వంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: హరీష్ రావు
స్వంత స్థలం ఉన్న లక్ష మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పేదలకు స్వంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
హైదరాబాద్: స్వంత స్థలం ఉన్న లక్ష మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పేదలకు స్వంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,72,763 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వేర్వేరు దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. లబ్దిదారులపై ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే ఈ ఇళ్లను నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా స్వంత స్థలం కలిగిన పేదలు ఆ స్థలంలోనే రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించడానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తోందని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
వచ్చే ఆర్ధిక సంవత్సరంలో లక్ష మంది లబ్దిదారులకు తమ స్వంత స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్ధిక సహాయం ప్రభుత్వం అందిస్తోందని హరీష్ రావు ప్రకటించారు.