Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ తమిళిసై పై రాష్ట్రపతికి లేఖ రాస్తాం: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళి  సై సౌందర రాజన్   రాజకీయాలు మాట్లాడారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్   చెప్పారు. రాష్ట్ర గవర్నర్ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  

Talasani Srinivas Yadav Reacts On Telangana Governor Tamilisai Soundararajan Comments
Author
First Published Jan 26, 2023, 2:59 PM IST

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలని  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  కోరారు.రిపబ్లిక్ డే  వేడుకలను పురస్కరించుకొని రాజ్ భవన్ లో  గవర్నర్  తమిళిసై సౌందర రాజన్  చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.   గురువారం నాడు  హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ రాజకీయాలు మాట్లాడడం తగదన్నారు. రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా గవర్నర్  మాట్లాడారని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  విమర్శించారు.  గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు  చేస్తామన్నారు.  రాజ్యాంగం అమలును రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు.

తెలంగాణ గవర్నర్  తమిళి సై సౌందర రాజన్,  కేసీఆర్ మధ్య  అగాధం పెరుగుతూ వస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వం  వ్యవహరిస్తున్న తీరును  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  తప్పుబుడుతున్నారు.  గవర్నర్ తీరుపై మంత్రులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం  వ్యవహరిస్తున్న తీరుపై  కేంద్ర  హోం శాఖ మంత్రి అమిత్ షాకు , ప్రధాని నరేంద్ర మోడీకి  గవర్నర్ ఫిర్యాదులు కూడా చేశారు.  గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని  తమిళిసై కోరారు.  జిల్లాల్లో  తాను పర్యటించిన సమయంలో  ప్రోటోకాల్  కూడ ఇవ్వడం లేదని  గవర్నర్  చెప్పారు.  ఇవాళ రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ దూరంగా  ఉన్నారు.  గత ఏడాది కూడా రాజ్ భవన్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్  హజరు కాలేదు.   రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమాలకు  కూడా  కేసీఆర్ దూరంగా  ఉంటున్నారు. 

also read:కేసీఆర్ దారిలోనే వెళ్తున్నారు: ఈటలపై రేవంత్ రెడ్డి సంచలనం

గత ఏడాది డిసెంబర్ మాసంలో  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  రాష్ట్ర పవర్యటనకు  వచ్చిన సమయంలో  కేసీఆర్, గవర్నర్ కలిసి  ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతికి  రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చిన విందుకు  కేసీఆర్ దూరంగా  ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios