Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ దారిలోనే వెళ్తున్నారు: ఈటలపై రేవంత్ రెడ్డి సంచలనం

కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయడాన్ని ఆయన  తప్పుబట్టారు. 

TPCC Chief  Revanth Reddy  Sensational Comments
Author
First Published Jan 26, 2023, 12:14 PM IST

హైదరాబాద్: కేసీఆర్ చేస్తున్న రాజకీయ విష ప్రచారంలో  ఈటల రాజేందర్  కూడా పాత్రధారి   అని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు   టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్  చేశారు. బీజేపీ సిద్దాంతాలను  ఈటల రాజేందర్,  వివేక్,  విశ్వేశ్వర్ రెడ్డిలు నమ్మరని రేవంత్  రెడ్డి అభిప్రాయపడ్డారు.  బీజేపీలో కూడా కోవర్టులున్నారని ఈటల రాజేందర్ అన్నారంటే  ఆయన  ఆ పార్టీపై అసంతృప్తితో  ఉన్నట్టేనన్నారు. కేసీఆర్ దారిలోనే  ఈటల రాజేందర్  వెళ్తున్నారని  రేవంత్ రెడ్డి విమర్శించారు.  . ఎన్నికల్లో డబ్బుల ఖర్చుకు  ఈటల రాజేందర్ వ్యతిరేకి అని ఆయన చెప్పారు.

రాజ్యాంగాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానించారన్నారు.  రిపబ్లిక్ డే వేడుకలను  రాజ్ భవన్ కే పరిమితం చేశారన్నారు. గవర్నర్ తో  విబేధాలుంటే  మరో వేదికపై ప్రదర్శించాలని  ఆయన అభిప్రాయపడ్డారు.  కేసీఆర్ వెంటనే గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలని  రేవంత్ రెడ్డి డిమాండ్  చేశారు.తన వ్యవహరశైలిని మార్చుకోవాలని  కేసీఆర్  కు సూచించారు  రేవంత్ రెడ్డి. 

also read:రాజ్యాంగ విరుద్దంగా పాలన: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న బండి సంజయ్ ను తొలగించి  ఈటల రాజేందర్ ను నియమిస్తారని  సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారంపై  ఈటల రాజేందర్ నిన్న స్పందించారు. ఈ ప్రచారానికి తాను ఎలా బాధ్యుడిని అవుతానని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో తనకు  ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయాన్ని ఆయన  మీడియా వద్ద  ప్రస్తావించారు. 

తొమ్మిది  ప్రభుత్వాలను  కూల్చేసిన  రాజ్యాంగాన్ని బీజేపీ అపహస్యం చేసిందన్నారు. హత్య, హత్యాచారాలకు  అమలు చేసే కఠిన శిక్షలను  పార్టీ ఫిరాయింపుదారులకు  వర్తింపజేయాలని ఆయన కోరారు.  పార్టీ ఫిరాయించిన  ఎమ్మెల్యేల  సభ్యత్వాలు కూడా రద్దు చేయాలని  ఆయన డిమాండ్  చేశారు. అవసరమైతే  ఉరితీసే విధానాన్ని తీసుకు రావాలని కూడా రేవంత్ రెడ్డి  కోరారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios