హైదరాబాద్:మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు మహిళలకు కేటాయిస్తే బీజేపీ ఓర్వలేకపోతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

శుక్రవారం నాడు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఎవరి ఓట్లు చీల్చడానికి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పోటి చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

కర్ణాకట, మధ్యప్రదేశ్ లలో చేసినట్టుగా చేద్దామనుకొన్నారా అని ఆయన ప్రశ్నించారు. మణికొండ, మక్తల్, కాంగ్రెస్, బీజేపీలు కలిసిన విషయం అందరికీ తెలుసునని ఆయన చెప్పారు. 

ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీయా అని ఆని ఆయన ప్రశ్నించారు. మీరే హిందువులా.... మాకు మాటలు రావా అన్నారు. 

అంటరాని పార్టీ ఏదైనా ఉంటే దాన్ని బ్యాన్ చేయాలని ఆయన బీజేపీకి సూచించారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.