ఏపీ ప్రజలను ఆడుకుంటున్నారు..బాబు చార్మినార్ కూడా నేనే కట్టానని అంటారు

First Published 24, Jul 2018, 4:08 PM IST
talasani srinivas yadav comments on BJP and Congress
Highlights

ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు.

ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. ఏపీ ప్రజలను అమాయకులను చేసి ఆడుకుంటున్నారని.. ప్రత్యేకహోదా కావాలని ఒకసారి అంటారని.. మరోసారి వద్దని అంటారని తలసాని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని.. చార్మినార్‌ను కూడా తానే కట్టానని అంటారని విమర్శించారు.. కాంగ్రెస్, బీజేపీలు రెండు దొందూదొందేనని చెప్పారు.. ప్రాంతీయ పార్టీలను అణచివేయాలన్నదే రెండు పార్టీల విధానమని.. దేశాభివృద్ధి ఆ పార్టీలకు అక్కర్లేదని ఆరోపించారు. దీని వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ను తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. ప్రజలు కోరుకున్న స్థాయిలో మోడీ పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు.

loader